English | Telugu
మీకు అంత నమ్మకముంటే జగన్, కేసీఆర్ లాగా చేసి చూపించండి.. బాబుకు సజ్జల కౌంటర్
Updated : Dec 18, 2020
"రెఫరెండానికి రెడీనా అని చంద్రబాబుగారు అడుగుతున్నారు. తాను నమ్మిన అంశాల మీద నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు గతంలో ఏం చేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. కాంగ్రెస్ నుంచి వేరుపడ్డ సమయంలో జగన్‌గారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌గారు ఏం చేశారో మనకు తెలిసిందే.. వారి తో ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజల ముందుకు వెళ్లారు. వైఎస్ జగన్ గారు, కేసీఆర్‌గారిలానే చంద్రబాబుగారు కూడా తాను చెబుతోన్న మాటలమీద ఆయనకు నమ్మకం ఉంటే ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే, ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుంది కదా?" అని సజ్జల చంద్రబాబుకు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.