English | Telugu
శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలి.. ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ
Updated : Aug 31, 2020
శ్రీశైలం దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ గతంలోనూ రేవంత్ ప్రధానికి లేఖ రాశారు. ప్రమాద సంకేతాలపై సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా వారు స్పందించ లేదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సిబ్బంది ప్రాణాలు, వేల కోట్ల రూపాయల ప్రజా సంపద కాలి బూడిద అయ్యిందన్నారు. ఈ మొత్తం అంశంపై నిజానిజాలు బయటకు రావాలంటే.. దీనిపై నిస్పాక్షింగా విచారణ జరగాలన్నారు. సీబీఐ విచారణ జరిపించాలని.. బాధిత కుటుంబాలకు రూ. కోటి సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గతంలోనూ ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిఐడీ విచారణలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సిబ్బంది స్పందిస్తున్నారు. శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో బ్యాటరీలు మార్చాలని రెండేళ్లుగా కోరుతున్నా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఇంజనీర్లు సిఐడీ టీమ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రమాదానికి పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.