English | Telugu
భారత్ లో కరోనాకు మరో కొత్త మందును ఓకే చేసిన డిసిజిఐ
Updated : Jul 11, 2020
ఈ ఇటోలిజుమాబ్ అనే మందు చాలా పవర్‌ఫుల్. దీంతో కరోనా చాలా తీవ్రంగా ఉండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషంట్లకు మాత్రమే దీన్ని ఇస్తారు. కరోనా వైరస్ అంతు చూసే యాంటీబాడీల ఉత్పత్తికి ఉపయోగపడే సైటోకిన్ల ను ఉత్పత్తి చేయడంలో ఇది బాగా పనిచేస్తోంది. ఎయిమ్స్‌కు చెందిన కొందరు నిపుణులు ఈ మందుతో చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఐతే ఇది చాలా పవర్‌ఫుల్ కాబట్టి ఈ మందును తీసుకోవాలనుకునేవారు ముందుగా తమ అంగీకారం తెలుపుతూ పేపర్‌పై సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ ఇటోలిజుమాబ్‌ని మే నెలలో కరోనా ఉధృతంగా ఉన్న ముంబైలోని నాయిర్ హాస్పిటల్ వాడి చూసింది. వెంటిలేటర్‌తో ఉన్న ఇద్దరు రోగులకు ఇవ్వగా వాళ్లు కోలుకొన్నారు. ఈ మందు ఒక డోస్ ఇవ్వగానే రోగులు కోలుకుంటున్నారని ఐతే కొంత మందికి మాత్రం 3 డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోందని సమాచారం.