English | Telugu
ప్రధానిగా మోదీ కొత్త రికార్డ్
Updated : Aug 14, 2020
ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్ నమోదు చేశారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రేసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఈక్రమంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని అధిగమించారు. వాజ్‌పేయి ప్రధానిగా 2,268 రోజులు పనిచేయగా.. మోదీ గురువారంతో ఈ రికార్డును అధిగమించారు.
ఇక మొత్తం ప్రధానమంత్రుల్లో దేశానికి సుదీర్ఘకాలం సేవలందించిన నాలుగో ప్రధానిగా నిలిచారు. తొలి మూడు స్థానాల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్నారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ 16ఏళ్లపాటు, ఇందిర 15ఏళ్ల పాటు, మన్మోహన్ పదేళ్ల పాటు ప్రధానులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత రికార్డు నిన్నటి వరకు వాజ్‌పేయి పేరు మీద ఉంది. తాజాగా ఆ రికార్డును మోదీ అధిగమించేశారు.