English | Telugu
తెలంగాణలో ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇలా.. యూపీలో అలా.. బీజేపీకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Updated : Nov 29, 2020
అంతేకాకుండా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఈ లెక్కన గడచిన ఆరేళ్లలో 12 కోట్ల కొత్త ఉద్యోగాలు రావాల్సి వుండగా, దానికి బదులు, అసలు ఉన్న ఉద్యోగాలే పోతున్నాయని అయన అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి తీరాలని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేసారు. కేంద్రానికి రూ. 2.72 లక్షల కోట్లను పన్ను రూపంలో తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే, కేవలం రూ.1.40 లక్షల కోట్లను మాత్రమే తిరిగి ఇచ్చారని, ఇదెలా ఉందంటే రూపాయి కడితే ఆఠాణా ఇచ్చినట్లుందని అయన కేంద్ర ప్రభుత్వం పై సెటైర్లు వేశారు.
దేశ ప్రజల కోసం ఏమీ చేయని బీజేపీ, పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో ఐటీ రంగానికి సపోర్ట్ గా నిలబడతామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ ను రద్దు చేసిందని, దీంతో చదువుకున్న యువత నోట్లో మట్టి కొట్టినట్లయిందని అయన అన్నారు. గడచిన ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే ప్రభుత్వం కనీసం ఒక్కరూపాయి కూడా విదల్చలేదని కేటీఆర్ మండిపడ్డారు.