English | Telugu
క్వాలిఫికేషన్ లేకున్నా రాష్ట్రంలోని అన్ని పోస్టులు రెడ్లకే..!
Updated : Aug 13, 2020
ఇక, రాజధాని అమరావతి గురించి మాట్లాడటానికి తనకేం సంబంధమన్న వైసీపీ నేతలపై కూడా రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. తనకే సంబంధం ఉందని.. కొంతమంది పిచ్చి వాగుడు వాగుతున్నారని ఘాటుగా విమర్శించారు. అమరావతిపై మాట్లాడటం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. విజయవాడ నేను పుట్టి పెరిగిన ప్రాంతం. ఇక్కడి పరిస్థితులపై నాకు అవగాహన ఉంది. రాజధానికి ఇది సరైన ప్రాంతం అన్నారు. " రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు చెల్లవు. అమరావతే రాజధానిగా ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఏదీ సాగదు" అని రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు.