English | Telugu
వైసీపీలో ఏం జరుగుతోంది?.. ఎంపీపై ఎమ్మెల్యే ఫిర్యాదు
Updated : Jul 9, 2020
తనను, తన సహచర ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఆయన వ్యాఖ్యలు చేసారని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు.
కాగా, బుధవారం పోడూరు పోలీస్ స్టేషన్ లో ఇదే రీతిలో మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతోనే ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.