English | Telugu
అమిత్ షా ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్
Updated : Aug 31, 2020
ఆగస్టు 2న అమిత్ షా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరి 12రోజుల చికిత్స తర్వాత ఆగస్టు 14న డిశ్చార్జి అయ్యారు. అయితే నాలుగురోజుల తర్వాత తిరిగి అనారోగ్యం బారిన పడటంతో ఆగస్టు 18న ఎయిమ్స్(ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ )లో చేరారు. అత్యంత నిపుణులైన వైద్యబృందం ఆధ్వర్యంలో చికిత్స తీసుకున్న తర్వాత ఆయన కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి అనారోగ్యంబారిన పడటంతో ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.