English | Telugu
ధరణి పోర్టల్ దేశానికే మార్గనిర్దేశం
Updated : Oct 29, 2020
ధరణి పోర్టల్ ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ.. ధరణి పోర్టల్ దేశానికే మార్గనిర్దేశంగా నిలుస్తుందని చెప్పారు. ధరణి పోర్టల్ ప్రారంభంతో రాష్ర్టంలోని 570 ఎమ్మార్వో కార్యాలయాన్ని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలుగా మారాయని స్పష్టం చేశారు. ఈ పోర్టల్ వల్ల అందరి ఆస్తులు, భూములకు రక్షణ ఉంటుందని, అక్రమ రిజిస్ట్రేషన్లకు తావుండదని చెప్పారు. ఈ పోర్టల్ వల్ల క్రయ, విక్రయాలన్నీ నమోదు చేసిన 15 నిమిషాల్లో పూర్తవుతాయని అన్నారు. కాళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, పైరవీలు చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచలేదని, పాత చార్జీలే అమల్లో ఉంటాయని తెలిపారు. గొప్పగొప్ప సంస్కరణలను తీసుకొచ్చినప్పడు ఇబ్బందులు రావడం సహజమని.. వాటిని ఎదుర్కొని నిలబడ్డప్పుడే అభివృద్ధి సాధించగలుగుతామని సీఎం కేసీఆర్ చెప్పారు.