ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు తెలిపారు. మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరం, శ్వాసపరమైన ఇబ్బందులతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేరిన సత్యేందర్ జైన్‌కు కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయనకు జ్వరం తగ్గకపోగా, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాని వైద్యులు తెలిపారు. న్యూమోనియా తీవ్రత ఎక్కువయినట్టు పేర్కొన్నారు. సాధారణంగా ఆక్సిజన్ స్థాయి 95 ఉండాలి.. కానీ, ఆయనకు 89కి పడిపోయిందని తెలిపారు. సత్యేందర్ జైన్ ఆరోగ్యం కొంత మెరుగుపడినట్టు గురువారం వెల్లడించారు. అంతలోనే మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సత్యేందర్ జైన్‌ను సాకేత్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించి.. అక్కడ ఆయనకు ప్లాస్మా చికిత్స చేయనున్నారని సమాచారం.