English | Telugu
కాంగ్రెస్ మేనిఫెస్టో.. అంతకు మించి.. వరద బాధితులకు రూ.50 వేలు
Updated : Nov 24, 2020
ఎంఎంటీఎస్, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని వెల్లడించింది. అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని తెలిపింది. 80 గజాలలోపు స్థలంలో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు అని ప్రకటించింది. క్షురకులు, రజకులు, వడ్రంగులకు చెందిన దుకాణాలకు ఆస్తిపన్నుతో పాటు విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తామని తెలిపింది. ధరణి పోర్టల్ రద్దుకు కృషి చేస్తామని తెలిపింది. ప్రతి కుటుంబానికి 30 వేల లీటర్ల ఉచిత మంచినీరు అందజేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది.