English | Telugu

అత్యాచార కేసుల విచారణ 2 నెలల్లో పూర్తిచేయాలి.. కేంద్రం తాజా మార్గదర్శకాలు 

మహిళలపై జరిగే నేరాల్లో పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విధివిధానాలను అనుసరించాలని తెలిపింది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ లో 19ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మహిళలపై జరిగే నేరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం విధివిధానాలను విడుదల చేసింది.

మహిళలపై లైంగిక వేధింపుల కేసుల సమాచారం అందిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, పోలీసుస్టేషన్‌ పరిధికి వెలుపల జరిగితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి.. నేరస్థుల్ని అరెస్టు చేసే తీవ్రత గల నేరాల విషయంలో చర్యలు తీసుకోని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లో పూర్తిచేయాలని పేర్కొంది.