English | Telugu
చెప్పిచ్చుక్కొడతా అంటూ టీడీపీ ఎమ్మెల్సీల పైకి దూసుకెళ్లిన సీనియర్ మంత్రి
Updated : Dec 2, 2020
అయితే ఆయన రికార్డులు పరిశీలించడానికి వెళ్తుండగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి లేచి.. కొందరు మంత్రులు సభలో వీధి రౌడీలకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారన్నారు. దీంతో మంత్రి బొత్స లేచి.. మంత్రులను వీధి రౌడీలు అంటావా? చెప్పిచ్చుక్కొడతా... అంటూ దీపక్‌రెడ్డి వైపు వేలు చూపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు కలుగజేసుకోవడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.
అయితే కొద్దిసేపు వాగ్వాదం తరువాత మంత్రి బొత్స, దీపక్‌రెడ్డి, నాగజగదీశ్వరరావు వైపు దూసుకొచ్చారు. దీంతో నాగజగదీశ్వరరావు జోక్యం చేసుకుంటూ.. ‘‘నోర్ముయ్.. చెప్పుచ్చుకుని కొడితే కొట్టించుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరిక్కడ’’ అని మంత్రికి కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా "రా చూసుకుందాం.. " అంటూ దీపక్‌రెడ్డి, నాగజగదీశ్వరరావు కూడా బొత్స వైపు దూసుకెళ్లారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే బొత్సను మరో మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆపే ప్రయత్నం చేశారు. మరోపక్క నాగజగదీశ్వరరావును టీడీపీ ఎమ్మెల్సీలు జనార్దన్ తదితరులు అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది.