బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ రోజు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రకాదని.. కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ పేర్కొన్నారు. నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని, దీంతో నిందితులు అందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే ఆద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ, కల్యాణ్‌సింగ్ తదితరులు నిర్దోషులుగా తేలారు.
కాగా, 1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అద్వానీ, జోషి వంటి బీజేపీ నేతలతో పాటు సంఘ్ పరివార్ నేతలు ప్రజలను రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపణలు వచ్చాయి.