English | Telugu

శ్రీశైలం పవర్ ప్లాంట్ వద్ద మరో అగ్నిప్రమాదం..

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన మరవకముందే తాజాగా మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. కరెంట్ కేబుల్ ను తాకుతూ డీసీఎం వ్యాన్ వెళ్లడంతో తాజాగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. భారీ శబ్ధాలతో మంటలు రావడంతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ప్రస్తుతం మంటలు ఆర్పుతున్నారు. మరిన్ని వివరాలు అందవలసి ఉంది.