English | Telugu
కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ.. 26 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం!!
Updated : Jul 15, 2020
పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలకు పెరగనున్నాయి. అయితే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది. అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.