English | Telugu
ఏపీలో రెండో విడత రైతు భరోసా ప్రారంభం
Updated : Oct 27, 2020
జూన్-సెప్టెంబర్ నెలల్లో వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారమందించింది. లక్షా 66 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.135 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. పంట నష్టపోయిన సీజన్‌లోనే పరిహారం ఇవ్వడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచేలా వైఎస్సార్ జలకళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఉచితంగా బోర్లు వేయడం, మోటార్లు అందించడం ద్వారా రైతన్న తన కాళ్లపై తాను నిలబడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వర్షాలు కురిసి ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయన్నారు. వరదలపై ప్రతిపక్షం చేస్తున్న రాజకీయాలు బాధ కలిగిస్తున్నాయని సీఎం న్నారు.