English | Telugu
దారుణం... పన్నెండేళ్ల బాలికను ఎత్తుకెళ్లి రేప్ చేశారు
Updated : Sep 11, 2020
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మహారాజ్ గంజ్ జిల్లాలో 12 ఏళ్ల బాలికను అపహరించి తీసుకువెళ్లిన ఇద్దరు మృగాళ్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
ఒకవైపు రామ జన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణం జరుగుతుండగా మరోవైపు ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. రామ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
దేశంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అత్యాచార ఘటనలు వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. ఇటీవల కరోనా సోకిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన మరువకముందే 12 ఏళ్ల బాలిక కామందుల కాటుకు గురికావడం శోచనీయం