English | Telugu

అల్లు అర్జున్, రాజమౌళి కాంబోలో వరల్డ్ షేకింగ్ ప్రాజెక్ట్!

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో గ్లోబల్ స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli). మరోవైపు 'పుష్ప'తో పాన్ ఇండియాని షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. తగ్గేదేలే అంటూ ఇంటర్నేషనల్ వైడ్ గా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా కాలేదు. వీరి కాంబో కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అది సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ విషయానికొస్తే.. అట్లీ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ 2027 వేసవికి విడుదలయ్యే అవకాశముంది. వీటి తర్వాత అటు రాజమౌళి నెక్స్ట్ ఫిల్మ్ విషయంలో కానీ, ఇటు అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కానీ.. క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ సంచలన వార్త వినిపిస్తోంది. అదేంటంటే, తదుపరి ప్రాజెక్ట్ కోసం రాజమౌళి-అల్లు అర్జున్ చేతులు కలపబోతున్నారట. అదే జరిగితే, ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడమే కాకుండా.. గ్లోబల్ స్థాయిలో భారీ సౌండ్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.