English | Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్ట్!

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్
ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) 2026 సంక్రాంతికి 'ది రాజా సాబ్'(The Raja Saab)తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న 'స్పిరిట్' కూడా ఇటీవల మొదలైంది. ఇదిలా ఉంటే ప్రభాస్ చేతిలో ఉన్న ఒక క్రేజీ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్'తో పాటు.. ప్రభాస్ చేతిలో 'సలార్-2', 'కల్కి-2' వంటి సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో 'సలార్-2'పై కొంతకాలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయినట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. (Salaar 2)

Also Read:ఒక్క ఫొటోతో ట్రోల్స్ కి చెక్ పెట్టిన ఎన్టీఆర్!

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'. 2023 డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి మంచి విజయం సాధించింది. అయితే వెయ్యి కోట్లు రాబట్టగల సత్తా ఉన్న ఈ మూవీ.. 600 కోట్లకు పరిమితమవ్వడం ప్రభాస్ ఫ్యాన్స్ ని కాస్త నిరాశపరిచింది. అయినప్పటికీ 'సలార్-2'తో అన్ని లెక్కలు సరి అవుతాయని వారు బలంగా నమ్మారు.

కానీ, 'సలార్' తర్వాత 'సలార్-2' చేయకుండా.. ఎన్టీఆర్ 'డ్రాగన్' ప్రాజెక్ట్ తో బిజీ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో ఆ సమయంలోనే అసలు 'సలార్-2' ఉంటుందా లేదా? అనే డౌట్స్ వచ్చాయి. మేకర్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెబుతూ వచ్చారు. దీంతో 'డ్రాగన్' తర్వాత 'సలార్-2' ఉండొచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అసలు ఎప్పటికీ ఉండకపోవచ్చని, డ్రాగన్ తర్వాత నీల్ మరో హీరో ప్రాజెక్ట్ తో బిజీ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.