Read more!

English | Telugu

న‌గ్మా ఒక‌ప్పుడు పెళ్ల‌యిన‌ సౌర‌వ్ గంగూలీతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంద‌ని తెలుసా?

 

ఒక‌ప్పుడు యాక్ట్రెస్‌గా పాపుల‌ర్ అయ్యి, ఇప్పుడు పొలిటీషియ‌న్‌గానూ రాణిస్తోంది న‌గ్మా. స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న 'బాఘీ' మూవీతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన న‌గ్మా.. ఆ వెంట‌నే 'పెద్దింట‌ల్లుడు' సినిమాలో సుమ‌న్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత కిల్ల‌ర్‌, ఘ‌రానా మొగుడు, మేజ‌ర్ చంద్ర‌కాత్‌, వార‌సుడు, అల్ల‌రి అల్లుడు లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో టాప్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. త‌మిళంలోనూ ఆమె అదే స్థాయిని ఎంజాయ్ చేసింది. 

ఆ త‌ర్వాత సౌత్‌లో వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వ‌డం, క్రేజ్ త‌గ్గ‌డంతో తిరిగి ముంబైకి వెళ్లి భోజ్‌పురి సినిమాల‌తో అక్క‌డ కూడా నంబ‌ర్ 1 హీరోయిన్ అనిపించుకుంది. ఆమె ఆ రేంజ్‌కు ఎద‌గడంలో గ్లామ‌ర్.. ముఖ్యంగా ఆమె క‌ళ్లు ఎస్సెట్‌గా నిలిచాయి. 46 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చిన‌ప్ప‌టికీ సింగిల్‌గానే ఉంటోన్న న‌గ్మా.. ఒక‌ప్పుడు మాజీ క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీతో పీక‌ల్లోతు ప్రేమ‌లో కూరుకుపోయింద‌ని ఇప్ప‌టి యూత్‌లో చాలా మందికి తెలీదు.

2001లో గంగూలీతో ఆమె సీరియ‌స్ రిలేష‌న్‌షిప్‌లో ఉంది. అప్పుడు గంగూలీ టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉన్నాడు. అంతే కాదు అత‌డికి పెళ్ల‌యింది కూడా. అయితే త‌మ మ‌ధ్య బంధాన్ని ఆ ఇద్ద‌రూ సీక్రెట్‌గానే ఉంచారు. ఒకానొక సంద‌ర్భంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఒక గుడిలో ఆ ఇద్ద‌రూ ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది కూడా. దీన్ని వారు ఖండించారు. కొంత‌కాలం గాఢ ప్రేమ‌లో ఉన్న ఆ ఇద్ద‌రూ అనూహ్య‌మైన కార‌ణంగా విడిపోయారు. ఇండియా ఏ మ్యాచ్‌లో ఓడిపోయినా, దానికి న‌గ్మాయే కార‌ణ‌మంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సౌర‌వ్ లైఫ్‌ను ఆమె నాశ‌నం చేస్తోందంటూ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చేవి.

భార‌త క్రికెట్ జ‌ట్టు చెత్త ఆట‌ను ప్ర‌ద‌ర్శించిన‌ప్పుడ‌ల్లా న‌గ్మాతో సౌర‌వ్ బంధం వ‌ల్లే అలా జ‌రుగుతోందంటూ విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌టంతో.. ఆ ఇద్ద‌రూ విడిపోవాల‌ని నిశ్చ‌యించుకున్నారు. సౌర‌వ్‌తో బంధానికి స్వ‌స్తి చెప్పిన న‌గ్మా త‌న కెరీర్‌పై దృష్టి పెట్టింది.