Read more!

English | Telugu

టాక్ ఆఫ్ ద టౌన్‌.. ఎంత పెద్ద బ్యాన‌రైనా నో చెప్పేస్తోంది!

 

బుచ్చిబాబా సానా డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై, తొలి సినిమాతోటే సెన్సేష‌న‌ల్ హీరోయిన్‌గా, యూత్ క‌ల‌ల రాకుమారిగా మారిపోయింది కృతి శెట్టి. ఆమె బ్యూటీకి మెస్మ‌రైజ్ అయిన జ‌నం, ఆమె న‌ట‌న‌కు ఫిదా అయ్యారు. దీంతో ఇవాళ టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న తార‌ల్లో ఒక‌రిగా ఆమె మారింది. ఇప్ప‌టికే కొన్ని ప్రాజెక్టులు అంగీక‌రించిన ఆమె కోసం హీరోలు, డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు క్యూలో ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు.

విడుద‌లైన ఒకే ఒక్క సినిమాతో కృతి త‌న రెమ్యూన‌రేష‌న్‌ను రూ. 50 ల‌క్ష‌ల‌కు పెంచేసింద‌ని టాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ అంత రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌డానికి ప్రొడ్యూస‌ర్లు ఏమాత్రం వెన‌క‌డుగు వెయ్య‌డం లేదు. చెప్పుకోద‌గ్గ విష‌య‌మేమంటే అంత అమౌంట్ ఇస్తామ‌న్నా కూడా కృతి కొన్ని సినిమాల‌ను ఒప్పుకోవ‌డం లేదు. రెండు పెద్ద ఫ్యామిలీల‌కు చెందిన సినిమాల‌ను ఆమె రిజెక్ట్ చేయ‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. 

వాటిలో ఒక‌టి డైరెక్ట‌ర్ తేజ సినిమా. ఇందులో హీరో డి. సురేశ్‌బాబు చిన్న‌కొడుకు అభిరామ్ ద‌గ్గుబాటి. అభి లాంచ్ ప్రాజెక్టును తేజ చేతిలో పెట్టాడు సురేశ్‌బాబు. ఇందులో హీరోయిన్‌గా కృతిని అడిగారు. కానీ ఆమె తిర‌స్క‌రించింది. అలాగే అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కునిగా వ్య‌వ‌హ‌రించే జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ సినిమాని కూడా ఆమె చేయ‌న‌ని చెప్పేసింది. అందులో నిఖిల్ హీరో కాగా, ఆ సినిమా పేరు '18 పేజెస్‌'. 

ఒక కొత్త హీరోయిన్ రెండు బిగ్ ఫ్యామిలీస్‌కు చెందిన సినిమాల‌ను చేయ‌న‌ని చెప్ప‌డం ఇప్పుడు టాలీవుడ్‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఎంత గ‌ట్స్ ఉంటే ఆమె ఆ ఆఫ‌ర్స్‌ను రిజెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు. అయితే త‌నకు ఆఫ‌ర్ చేసిన రోల్‌తో పాటు స్క్రిప్ట్ న‌చ్చితేనే కృతి ఏ ప్రాజెక్టుకైనా సంత‌కం చేస్తోంది. వ‌చ్చిన ప్ర‌తి ఆఫ‌ర్‌ను.. అది ఎంత పెద్ద బ్యాన‌ర్ అయినా.. నిర్భ‌యంగా తిర‌స్క‌రించేస్తోంది. రానున్న రోజుల్లో కృతి ఏం చేస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం ఆమె నానితో 'శ్యామ్ సింగ రాయ్‌', సుధీర్‌బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలు చేస్తోంది.