Read more!

English | Telugu

సంక్రాంతి నాగార్జునదే.. ప్రూఫ్స్ తో సహా మీ ముందు ఉంచిన నిజం

సంక్రాంతి..  ప్రజలందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటు తెలుగు వాళ్ళందరు కలిసి కట్టుగా జరుపునే ఒక ముఖ్యమైన పండగ. అలాగే తమ మధ్య ఉన్న ఈర్ష్య ,అసూయ, రాగ ద్వేషాలని పోగొట్టి తామందరం కలిసి మెలిసి ఉండేలా చూడమని తమకి నచ్చిన దైవాన్ని వేడుకునే పండగ కూడా సంక్రాంతినే. ఆ పండగ యొక్క ఔన్నత్యాన్ని పరమార్ధాన్నితెలుపుతు అదే టైటిల్ తో  వెంకటేష్ హీరోగా వచ్చిన మూవీ సంక్రాంతి. మరి ఈ మూవీకి మొదట అనుకున్న హీరో వెంకటేష్ కాదని మీకు తెలుసా?

విక్టరీ వెంకటేష్ సినిమా కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చాలా చిత్రాల్లో సంక్రాంతి మూవీ కూడా ఒకటి. 2005 లో వచ్చిన ఆ  మూవీ సంచలన విజయాన్ని సాధించడంతో పాటుగా చాలా సెంటర్స్ లో సరికొత్త రికార్డు లని నెలకొల్పింది. హిట్ చిత్రాల దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన సంక్రాంతిలో   మొదట హీరోగా మొదట యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ని అనుకున్నారు. ఈ మేరకు చిత్ర కథ మొత్తాన్ని నాగార్జున కి శివ చెప్పడం నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం  జరిగింది.  దీంతో ఆర్ బి చౌదరి నిర్మాతగా నాగ్ ముప్పలనేని శివ కాంబోలో సంక్రాంతి మూవీ ప్రారంభం అవుతుందని అందరు భావించారు.కానీ నాగార్జున  తనకున్న మాస్ ఇమేజ్ కి అన్నదమ్ముల సెంటిమెంట్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవదని బావించాడో ఏమో సంక్రాంతి  సినిమా ప్లేస్ లో వేరే సినిమాని చేసాడు. నాగార్జున నే సంక్రాంతి కి మొదటి అనుకున్న హీరో అని స్వయంగా ముప్పలేని శివే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.

ఆ తర్వాత సంక్రాంతి సినిమా వెంకటేష్ హీరోగా తెరకెక్కడం జరిగింది.ఇంటి బాగోగులు చూసే ఇంటి పెద్దగా తమ్ముళ్ల మీద ఎంతో ప్రేమని పెంచుకున్న అన్నయ్యగా వెంకటేష్ నటన నభూతో న భవిష్యత్తు అనే రీతిలో ఉంటుంది. తమ్ముళ్లు గా శ్రీకాంత్, శర్వానంద్, శివ బాలాజీ లు నటించారు. వీళ్ళకి జోడిలుగా స్నేహ, సంగీత, రతి లు నటించగా ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించింది. చంద్రమోహన్, శారద లు వెంకటేష్ తల్లి తండ్రులుగా నటించారు. అలాగే మిగతా పాత్రల్లో ప్రకాష్ రాజ్, సుధాకర్, తనికెళ్ళ భరణి లు తమ పాత్రల్లో అధ్భుతంగా నటించి సినిమా విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.అన్న దమ్ముల మద్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ కి అయితే కంటి తడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు. పరుచూరి బ్రదర్స్ మాటలు సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చాయి. 

70 కి పైగా  కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకున్న సంక్రాంతి మూవీ కనుక వెంకటేష్ కాకుండా నాగార్జున చేసుంటే ఎలా ఉండేదో గాని నేటికి ఈ మూవీ టీవీ లో వస్తుంటే ప్రేక్షకులు బ్రహ్మ రధం పడతారు.అలాగే ఈ మూవీలో వేణు మాధవ్, ఏవిఎస్ ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే సూపర్ గా ఉంటాయి నేటికి యు ట్యూబ్ లో ఆ కామెడీ సీన్స్ చూస్తు చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. ఉమ్మడి కుటుంబాల ఆవశ్యతని తెలిపిన సంక్రాంతి మూవీ చూసి విడిపోయిన అన్నదమ్ముల కుటుంబాలు మళ్ళీ కలిసిన సందర్బాలు ఉన్నాయి.