Read more!

English | Telugu

'బ‌జార్ రౌడీ'గా మారిన బ‌ర్నింగ్ స్టార్‌!

 

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రేక్ష‌కుల్ని మ‌రోసారి న‌వ్వించేందుకు రెడీ అవుతున్నాడు. అత‌ను హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్‌కు 'బ‌జార్ రౌడీ' అనే టైటిల్ అనౌన్స్ చేశారు. బుధ‌వారం టైటిల్ డిజైన్‌, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. వ‌సంత నాగేశ్వ‌ర‌రావు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కె.ఎస్‌. క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సందిరెడ్డి శ్రీ‌నివాస‌రావు నిర్మిస్తున్నారు.

మోష‌న్ పోస్ట‌ర్‌లో మొద‌ట చార్మినార్‌ను, న‌‌డుస్తున్న మెట్రో ట్రైన్‌ను చూపించి, త‌ర్వాత ర‌సూల్‌పుర ప్లేస్‌ను చూపించారు. అక్క‌డ‌కు కొంత‌మంది రౌడీలు క‌త్తులు క‌టార్ల‌తో వ‌చ్చారు. వాళ్ల‌కు కొద్ది గ‌జాల దూరంలో రోడ్డుమీద వేసిన న‌వారు మంచంపై కులాసాగా కాలుచాపు ప‌డుకొని, లైట‌ర్‌తో తాపీగా సిగ‌రెట్ వెలిగించుకుంటున్న సంపూర్ణేష్ బాబు మాస్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నాడు. ఆ రౌడీల‌ను బ‌జార్ రౌడీ ఎలా ఎదుర్కొన్నాడో సినిమాలో చూసి న‌వ్వుకోవాల్సిందే.

'హృద‌య కాలేయం', 'కొబ్బ‌రిమ‌ట్ట' లాంటి చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న సంపూర్ణేష్ బాబు ఇప్పుడు 'బ‌జార్ రౌడీ'గా అల‌రించేందుకు రెడీ అవుతున్నాడ‌న్న మాట‌. మ‌హేశ్వరి వద్ది హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో నాగినీడు, సాయాజి షిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, క‌రాటే క‌ల్యాణి ఇత‌ర పాత్ర‌ధారులు.

మ‌రుధూరి రాజా సంభాష‌ణ‌లు రాస్తున్న ఈ మూవీకి సాయికార్తీక్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. అడుసుమిల్లి విజ‌య్‌కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, గౌతంరాజు ఎడిట‌ర్‌గా, జాషువా ఫైట్ మాస్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.