English | Telugu
కొత్త దర్శకులతో నాగ్ మెమరబుల్ హిట్స్!
Updated : Aug 29, 2023
కొత్త దర్శకులకు అవకాశాలివ్వడంలో కింగ్ నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. అలా ప్రోత్సహిస్తూనే పలు మెమరబుల్ మూవీస్ ని తన ఖాతాలో జమ చేసుకున్నారాయన. కొత్త దర్శకుల కాంబినేషన్ లో నాగ్ అందుకున్న విజయాల వివరాల్లోకి వెళితే..
శివ (1989): సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఇదే తొలి చిత్రం. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ మూవీ.. నాగ్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్.
నువ్వు వస్తావని (2000): వి. ఆర్. ప్రతాప్ కిదే తొలి చిత్రం. అన్నమయ్య తరువాత సరైన విజయం లేని నాగ్ కి మళ్ళీ గ్రాండ్ సక్సెస్ ని అందించిన సినిమా. తుళ్ళదా మనముమ్ తుళ్ళుమ్ అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్ వెర్షన్.
నిన్నే ప్రేమిస్తా (2000): తమిళ చిత్రం నీ వరువాయ ఎనా ఆధారంగా రూపొందిన ఈ హిట్ సినిమాతో ఆర్.ఆర్. షిండే దర్శకుడిగా తొలి అడుగేశాడు.
సంతోషం (2002): నాగ్ కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిలిచే ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ చిత్రంతో దశరథ్ దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.
మాస్ (2004): నాగ్ కెరీర్ లో గుర్తుండిపోయే మాస్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంతోనే నృత్య దర్శకుడు లారెన్స్ రాఘవ తొలిసారిగా మెగాఫోన్ పట్టారు.
సోగ్గాడే చిన్ని నాయనా (2016): నాగ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ ఇది. ఈ సినిమాతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా తొలి అడుగేశాడు.
(ఆగస్టు 29.. నాగార్జున బర్త్ డే సందర్భంగా)