Read more!

English | Telugu

"‌ఇదిగో నా సీత‌!".. రామ్‌చ‌ర‌ణ్ షేర్ చేసిన అలియా లుక్‌!

 

య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి రూపొందిస్తోన్న, 2021 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియ‌న్ మూవీస్‌లో ఒక‌టైన 'ఆర్ఆర్ఆర్‌: రౌద్రం ర‌ణం రుధిరం'లో అలియా భ‌ట్ పోషిస్తోన్న సీత క్యారెక్ట‌ర్ లుక్ వ‌చ్చేసింది. రెండు రోజులుగా ఈ లుక్ కోసం ఫ్యాన్స్ అత్యంత ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 15 అంటే నేడు అలియా పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం సీత‌గా అలియా రూపాన్ని విడుద‌ల చేసింది. అల్లూరి సీతారామ‌రాజు అస‌లు పేరు అల్లూరి రామ‌రాజు. ఆయ‌న వ‌ల‌చి పెళ్లిచేసుకోవాల‌నుకున్న యువ‌తి సీత‌. అందుకే త‌న పేరును అలా మార్చేసుకున్నారు. ఆ సీత పాత్ర‌లో అలియా మ‌న‌కు క‌నిపించ‌నున్న‌ది.

సోమ‌వారం త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా అలియా భ‌ట్ ఫ‌స్ట్ లుక్‌ను రాజ‌మౌళి షేర్ చేశారు. దాంతో పాటు, "Strong-willed and resolvent SITA's wait for Ramaraju will be legendary! Presenting @aliaa08 as #Sita to you all :)" అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌లో అలియా ఆకుప‌చ్చ చీర‌, బుట్ట చేతుల ప‌ట్టు ర‌విక‌, మెడ‌లో బంగారు గొలుసు, ముక్కుపుడ‌క‌, త‌ల‌కు పాపిట బిళ్ల ధ‌రించి, త‌న రామ‌రాజు కోసం ఎదురుచూస్తున్న‌ట్లుగా కూర్చొని ఉంది. ఆమె ముందు ఓ పూల బుట్ట‌, ఆమెకు అటు ఇటు వెలుగుతున్న దీపాలు క‌నిపిస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్'లో అలియా లుక్ బ‌య‌ట‌కు రావ‌డం ఆల‌స్యం, నెట్టింట వైర‌ల్ అయిపోయింది. ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్ అవుతోంది.

ఇక త‌న సీత కోసం రామ‌రాజు కూడా స్పందించాడు. రామ‌రాజుగా న‌టిస్తోన్న రామ్‌చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో అలియా లుక్‌ను షేర్ చేసి, "She adds meaning to Ramaraju's mission! Meet my #Sita, a woman of strong will and resolve. Wishing you a glorious year ahead Alia @aliaa08 !" అంటూ రాసుకొచ్చాడు. 

అలాగే కొమ‌రం భీమ్ పాత్ర‌ధారి జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా అలియా లుక్‌ను షేర్ చేసి, "Her wait will be legendary! Here's @aliaa08 as #Sita, the epitome of strong will and resolve. Happy birthday Dear Alia, have a great one!" అని ట్వీట్ చేశాడు.

ఆగ‌స్ట్ 13న 'ఆర్ఆర్ఆర్'ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.