Read more!

English | Telugu

నా శిష్యుడికి దర్శకుడిగా ఛాన్స్ ఇస్తేనే సినిమాకి దర్శకత్వం చేస్తా: రాఘవేంద్రరావు 

 

 

సినిమా దర్శకుడు అవ్వాలని కోరుకునే వాళ్ళు ఒక దర్శకుడు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా చేరతారు. తన గురువు దగ్గర దర్శకత్వ శాఖ కి సంబంధించిన అన్ని విద్యలు నేర్చుకొని తాను కూడా దర్శకుడిగా ట్రై చేస్తుంటాడు. కాని ఆ దర్శకుడే తన దగ్గర కొచ్చిన ఒక నిర్మాతతో నా శిష్యుడికి డైరెక్టర్ గా అవకాశం ఇస్తేనే మీ సినిమాకి దర్సకత్వం చేస్తానని ఖరాకండిగా చెప్పాడు. అలా అని ఆ దర్సకుడేమి ఆషామాషి దర్సకుడేమి కాదు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఆ దర్శకుడి చరిత్ర ప్రస్తుతం నడుస్తున్న కాలానికి  తీపి గుర్తు...తెలుగు సినిమా వైభవానికి కూడా తీపి గుర్తు..అప్పటి దాకా ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా వచ్చినా జనం ఆ సినిమా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళు. కాని ఆయన సినిమా వచ్చాక జనం ధియేటర్ లో తెర ముందు డాన్సులు వెయ్యడం తో పాటు తెర మీద డబ్బులు వేయడం మొదలు పెట్టారు. తనకి మాత్రమే సాధ్యమయ్యే కమర్షియల్ ఫార్మేట్ తో సినిమా తీసి ప్రేక్షకుల చేత డాన్సులు వేయించాడు. అంతటి ఘనత ఆయన సొంతం. ఆయనే  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అలాంటి ఆయన ఎవరికోసం తన నిర్మాతతో మాట్లాడాడు?

మాములు హీరో అగ్ర హీరో గా మారాలంటే రాఘవేంద్ర రావే దిక్కు. తన దర్శకత్వ ప్రతిభ తో తెలుగు సినిమా తీరు తెన్నులనే మార్చివేసిన లెజండరీ డైరెక్టర్ అయన. అలాంటి రాఘవేంద్ర రావు తన నిర్మాతతో ఎవరికీ దర్శకుడిగా అవకాశం ఇవ్వమని మాట్లాడారో తెలుసా? ది గ్రేట్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గురించి.

తన సినిమా కెరీర్ మొదట్లో కోదండ రామిరెడ్డి చాలా సినిమాలకి రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ దగ్గర పని చేసాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వ శాఖ లో ఎంత బిజీ గా ఉన్నా తన దగ్గర పని చేసే వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. అలా రాఘవేంద్ర రావు మొదటి నుంచి కోదండ రామిరెడ్డి ని కనిపెడుతూనే ఉండేవారు. ఆ తర్వాత రాఘవేంద్ర రావు కి కోదండరామి రెడ్డి టాలెంట్ గురించి పూర్తిగా అర్ధమయ్యి సినిమాకి సంబంధించిన పూర్తి పనులు మొత్తం కోదండరామి రెడ్డి కే అప్పచెప్పేవారు. ఆ తర్వాత కోదండరామిరెడ్డి సొంతంగా డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. రెండు సినిమాలు ఆయన దర్సకత్వంలో నిర్మాతలు ప్రకటించి కూడా ఆ తర్వాత సినిమా ని ఆపేసారు. దీంతో కోదండ రామిరెడ్డి ఏడ్చిన  సందర్బాలు కూడా ఉన్నాయి.

కోదండ రామిరెడ్డి కి దర్శకుడిగా అవకాశాలు వచ్చి పోతున్నాయనే  విషయం రాఘవేంద్ర రావుకి తెలిసింది. దీంతో రాఘవేంద్రరావు తన దగ్గరకొచ్చిన ఒక నిర్మాతతో నేను మీ సినిమా చెయ్యాలంటే మీరు కోదండరామి రెడ్డి కి దర్శకుడిగా అవకాశం ఇవ్వాలని అన్నాడు. ఈ విషయాలన్నీ స్వయంగా కోదండ రామి రెడ్డే ఒక ఇంటర్వ్యూ లో  చెప్పాడు. ఆ తర్వాత కోదండ రామి రెడ్డి 96 సినిమాలకి దర్శకత్వం వహించమే కాకుండా వాటిల్లో ఎక్కువ శాతం  సినిమాలని విజయవంతం చేసి నెంబర్ వన్ కమర్షియల్ డైరెక్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి కల్లెక్షన్ల వర్షాన్ని కురిపించాడు. మెగాస్టార్ చిరంజీవి తో ఎన్నో సూపర్  హిట్ సినిమాలుని  కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. అలాగే తన గురువు రాఘవేంద్ర రావు సినిమాలకి పోటిగా కోదండరామి రెడ్డి సినిమాలు వచ్చి విజయం సాధించాయి.

అలా కోదండరామిరెడ్డి అనే ఒక అద్భుత దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండేలా  చేసిన రాఘవేంద్ర రావుకి హాట్స్ ఆఫ్.