English | Telugu
బర్త్ డే స్పెషల్: సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ టాప్ 10 హిట్స్!
Updated : Jul 29, 2023
పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేసినా.. ఛాయాగ్రాహకుడిగా తెలుగునాట ఎనలేని గుర్తింపుని తెచ్చుకున్నారు కె.కె. సెంథిల్ కుమార్. ఇటీవలే 20 ఏళ్ళ కెరీర్ పూర్తిచేసుకున్న సెంథిల్.. ఇప్పటివరకు 16 చిత్రాలకు పనిచేశారు. వాటిలో పది సినిమాలు విజయపథంలో పయనించడం విశేషం. జూలై 29 సెంథిల్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కెరీర్ లో టాప్ 10 హిట్స్ (రిలీజ్ ఇయర్ ఆర్డర్ ప్రకారం) ఏంటో చూద్దాం..
10. ఐతే: 2003లో వచ్చిన ఈ సక్సెస్ ఫుల్ మూవీతోనే సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా తొలి అడుగేశారు. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు.
9. సై: ఛాయాగ్రాహకుడిగా సెంథిల్ స్థాయిని పెంచిన చిత్రమిది. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి రూపొందించిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. సెంథిల్ కి రెండో సినిమా. 2004లో రిలీజైన ఈ మూవీలో నితిన్ కథానాయకుడిగా నటించాడు.
8. ఛత్రపతి: సెంథిల్ కి హ్యాట్రిక్ మూవీ ఇది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేసిన ఈ సినిమాకి కూడా రాజమౌళినే దర్శకుడు. 2005లో ఈ యాక్షన్ డ్రామా జనం ముందు నిలిచింది.
7. యమదొంగ: ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో సెంథిల్ కి హ్యాట్రిక్ మూవీ.. 'యమదొంగ'. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో కనిపించాడు. 2007లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
6. అరుంధతి: లేడీ సూపర్ స్టార్ అనుష్క టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాకి శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ నిర్దేశకుడు. 2009 సంక్రాంతికి సందడి చేసిన 'అరుంధతి'.. సెంథిల్ కుమార్ కెరీర్ లో ఏకైక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం.
5. మగధీర: 2009లో వచ్చిన ఈ పునర్జన్మల ప్రేమకథా చిత్రం.. సెంథిల్ కుమార్ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ మూవీ. ఇక రాజమౌళి కాంబినేషన్ లో సెంథిల్ కి ఇది నాలుగో సినిమా. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో టైటిల్ రోల్ లో దర్శనమిచ్చాడు.
4. ఈగ: 2012లో సందడి చేసిన ఈ సినిమాలో సెంథిల్ కుమార్ విజువల్స్.. మరో స్థాయిలో ఉంటాయి. ఈ సినిమాకి కూడా రాజమౌళినే దర్శకుడు. నాని, సమంత ఇందులో జంటగా అలరించారు.
3, 2: బాహుబలి సిరీస్: 2015లో రిలీజైన 'బాహుబలి: ది బిగినింగ్', 2017లో విడుదలైన 'బాహుబలి: ది కంక్లూజన్'కి సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం ఓ ఎస్సెట్ గా నిలిచింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సిరీస్ కి రాజమౌళి కెప్టెన్. ఈ రెండు భాగాలు కూడా తెలుగునాట ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అలాగే, జాతీయ స్థాయిలోనూ రికార్డ్ స్థాయి వసూళ్ళు కురిపించాయిఈ పాన్ ఇండియా సెన్సేషన్స్.
1. ఆర్ ఆర్ ఆర్: 2022లో వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్'.. కెమెరామేన్ గా సెంథిల్ స్థాయిని మరింతగా పెంచింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆస్కార్ అవార్డు అందుకున్న "నాటు నాటు" పాటకి సెంథిల్ కుమార్ విజువల్స్ కూడా ఓ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.