Read more!

English | Telugu

లిప్ లాక్ పెట్టుకున్న మొదటి  హీరో హీరోయిన్ ఎవరో తెలుసా?

ఇండియన్ సినిమా హిస్టరీ లో  సిల్వర్ స్క్రీన్ మీద  ముద్దు పెట్టుకున్న  ఐ మీన్ 'లిప్ లాక్ కిస్' పెట్టుకున్న హీరో  హీరోయిన్ లు ఎవరో మీకు తెలుసా? పోనీ ఆ సినిమా పేరు అయిన మీకు తెలుసా? ఇప్పుడంటే స్క్రీన్ మీద ఆ లాంగ్వెజ్ సినిమా ఈ  లాంగ్వెజ్  సినిమా అనే  తేడాలేకుండా అన్ని లాంగ్వెజ్ సినిమాల్లో కూడా సన్నివేశం డిమాండ్ చేసినా  చెయ్యకపోయిన లిప్ లాక్ లు సాధారణమయిపోయాయి.  కానీ  హీరో  హీరోయిన్ లు మొదటి లిప్ లాక్ పెట్టిన కాలంలో అయితే లిప్ లాక్ లు కాదు కదా అసలు హీరో హీరోయిన్లు ముద్దు పెట్టుకున్నా దేశ ద్రోహం కింద లెక్కేసేవాళ్ళు. మరి అలాంటి  కాలంలో లిప్ లాక్ పెట్టుకొని డేర్ చేసిన ఆ పెయిర్ ఎవరో, ఆ సినిమా ఏంటో చూద్దాం.

అది 1933  వ సంవత్సరం..అంటే ఇండియా కి ఇంకా స్వాతంత్రం రాని రోజులు. అప్పుడప్పుడే మెల్లగా హిందీ చిత్ర సీమలో  సినిమాలు  రూపుదిద్దుకోవడం జరుగుతుంది. కానీ అన్ని కూడా సైలెన్స్ సినిమాలే. అప్పటికే 1913 వ సంవత్సరం లో రాజా హరిచంద్ర, ఆ తర్వాత 1931 లో ఆలం ఆరా అనే సినిమాలు వచ్చాయి. వాటి తర్వాత 1933  వ సంవత్సరంలో కర్ణ అనే సినిమా వచ్చింది. హిమాన్షు రాయ్ హీరో గా దర్శకుడుగా ఈ సైలెన్స్ సినిమా వచ్చింది.  దేవిక  రాణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లోనే హిమాన్షు రాయ్ అండ్ దేవిక రాణి లు లిప్ లాక్ సన్నివేశం లో నటించారు.

భారతీయ సినిమా చరిత్రలోనే ఈ లిప్ లాక్ మొట్టమొదటి లిప్ లాక్ సన్నివేశం. ఈ సినిమా ని చూసిన అప్పటి ప్రేక్షకులు వామ్మో ఏంటి వాళ్లిద్దరూ ఇలా చేసారని సిగ్గుతో చచ్చిపోయారు. కొంత మంది అయితే హిమాన్షు రాయ్, దేవిక రాణిలు మన  సంస్కృతి సంప్రదాయాలని మర్చిపోయి మన భారత దేశ పరువుని తీసారని ఆ ఇద్దరి అంతు చూడాలని కొన్ని ఉద్యమాలు లాంటివి కూడా చేసారు. కానీ ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే హిమాన్షు రాయ్, దేవిక రాణి లు నిజ జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్. పెళ్లి తర్వాతే  కర్ణ సినిమాలో ఇద్దరు లిప్ లాక్ సన్నివేశంలో నటించారు.