Read more!

English | Telugu

ఘంట‌సాల బావ‌ సుబ్బుగారు హైదరాబాద్ వచ్చారు!

 

సుబ్బుగారు ఈ తరానికి తెలియక పోవచ్చు.  తెలిస్తే, ఆశ్చర్య పోవాల్సిందే!  అవును, అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది సుబ్బు గారే! ఘంటసాలకు స్వయాన బావగారు!  ఘంటసాల స‌తీమ‌ణి సావిత్రి గారి సొంత అన్నయ్యే  సుబ్బుగారు!  సుబ్బుగారి పూర్తి పేరు కొడమంచిలి సుబ్బారావు!  

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు  సుబ్బుగారి ఊరు! సావిత్రి గారితో ఘంటసాల వివాహం అయ్యాక, ఆయ‌న‌ గంధ‌ర్వ‌ స్వరం చూసి, ఒకరోజు సుబ్బు గారు ప్రత్యేకంగా సీనియర్ సముద్రాల (రాఘ‌వాచార్య‌) గారికి ఘంటసాలను పరిచయం చేశారు! అలా ఘంటసాల సినీ రంగ ప్రవేశానికి  అడుగులు వేయించారు!

Also read:  సింగ‌ర్ రాజ్ సీతారామ్‌ను సూప‌ర్‌స్టార్‌ కృష్ణ ఎందుకు ఎంక‌రేజ్ చేశారు?

సుబ్బుగారు చెన్నై (అప్పటి మద్రాస్)లో తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్! ఆ రోజుల్లో జివిఎస్ ప్రొడక్షన్స్ లో పని చేశారు! దగ్గరుండి నందమూరి తారక రామారావు గారికి సొంత‌వూరు సినిమా కోసం తొలిసారి శ్రీకృష్ణుడు వేషం వేయించింది కూడా సుబ్బు గారే! త‌న‌ను శ్రీకృష్ణుని వేషంలో చూసుకొని మురిసిపోయిన ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఆ కాస్ట్యూమ్, కిరీటం తనకు కావాలని కోరితే, సుబ్బుగారిని అడిగి ఘంట‌సాల ఇచ్చేశారు. 'పాండురంగ మహాత్యం'లో మళ్ళీ అదే కాస్ట్యూమ్ ధరించారట ఎన్టీఆర్!  

Also read:  పూర్ణ హీరోయిన్‌గా ర‌విబాబు వ‌రుస‌గా మూడు సినిమాలు ఎందుకు చేశాడు?

అంతే కాదు, సుబ్బుగారు దిగ్ద‌ర్శకుడు క‌ళాత‌ప‌స్వి కె. విశ్వనాథ్ గారి క్లాస్మేట్‌! ఇద్దరూ ఒరే అనుకునే మిత్రులు! ఇప్పుడు సుబ్బు గారి వయసు 92.  వయసును జయించి చాలా హుషారుగా హాయిగా ఆనందంగా ఉన్నారు!  సినీ పరిశ్రమను వదిలేశాక చాలా కాలం సొంతూరులో అర్చకత్వం చేశారట!  ఇటీవ‌ల హైదరాబాద్‌లో ఉన్న‌ మనవడు కిషన్ దగ్గరకు వచ్చి, ప్ర‌స్తుతం అక్క‌డే ఉన్నారు.

క‌ర్టెసీ: డా. మహ్మద్ రఫీ (ఫేస్‌బుక్ పోస్ట్ ఆధారంగా)