Read more!

English | Telugu

పెళ్లికి అంతా సిద్ధం.. నెక్స్‌ట్‌ మినిట్‌లోనే ఆ పెళ్లి క్యాన్సిల్‌.. ఎందుకలా?

ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. యువతీ యువకుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చేది పెళ్లి. ఇంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే ఎంతో ఆర్భాటంగా, మరెంతో ఆడంబరంగా పెళ్లిళ్లు చేస్తుంటారు. ఒకప్పుడు పెళ్లి విషయంలో పెద్దలదే నిర్ణయం ఉండేది. పెద్దల అంగీకారంతో, పెద్దల సమక్షంలోనే పెళ్లిళ్లు జరిగేవి. కాలం మారుతూ వస్తోంది. పెళ్లి విషయంలో యువతీ యువకుల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. తన జీవిత భాగస్వామని ఎంపిక చేసుకొని, కొన్నాళ్ళు ప్రేమలో విహరించి, ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు పెద్దలు ఒప్పుకోకపోతే ధైర్యంగా బయటికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమలో మునిగి తేలిన తర్వాత పెళ్లి చేసుకోలేని కొన్ని జంటలు విడిపోతున్నాయి. మరికొందరు పెళ్లి వరకు వచ్చి, నిశ్చితార్థం కూడా చేసుకొని తర్వాత వాటిని రద్దు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు సామాన్యుల్లోనే కాదు, సెలబ్రిటీలలో కూడా ఈమధ్య ఎక్కువయ్యాయి. సినిమా సెలబ్రిటీస్‌కి పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్ళు కాపురం చేయడం, ఆ తర్వాత విడాకుల పేరుతో విడిపోవడం సర్వసాధారణమైన విషయం. కానీ, పెళ్లి వరకూ వచ్చి క్యాన్సిల్‌ చేసుకోవడం కూడా ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అలా పెళ్లి వరకూ వచ్చి తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న కొందరు సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం.

తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న తన కెరీర్‌ ప్రారంభంలోనే సహనటుడు రక్షిత్‌శెట్టిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. ఆ తర్వాత ఏమైందో తెలీదుగానీ, తమ పెళ్లి క్యాన్సిల్‌ చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ విడిపోయారు. తెలుగు, తమిళ, హిందీలో భాషల్లో పలు సినిమాల్లో నటించి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న మెహరీన్‌ వివాహం భవ్యబిష్ణోయ్‌తో జరగాల్సి ఉంది. ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి కూడా క్యాన్సిల్‌ అయింది. హీరోయిన్‌ త్రిష, బిజినెస్‌ మేన్‌ వరుణ్‌ ప్రేమించుకున్నారు. ప్రేమ విహారాలు చేసారు. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని ఇద్దరూ అనుకున్నారు. పెళ్లికి సిద్ధమయ్యారు. ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్‌ అయింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించాలా, వద్దా అనే విషయంలో ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాంతో వీరు కూడా పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇది జరిగిన తర్వాత త్రిష సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. వరుణ్‌ మాత్రం హీరోయిన్‌ బిందు మాధవితో డేటింగ్‌ చేస్తున్నాడు.

ఇక హీరో గోపీచంద్‌ వివాహం హైదరాబాద్‌కి చెందిన హరితతో ఫిక్స్‌ అయింది. 2012లో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అయితే ఏవో కారణాల వల్ల ఆ పెళ్ళికి ఆగిపోయింది. ఎందుకో తెలీదుగానీ హరిత సూసైడ్‌ ఎటెమ్ట్‌ చేసిందనే వార్త అప్పట్లో గుప్పుమంది. ఇది జరిగిన ఏడాదికి రేష్మా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు గోపీచంద్‌. టాలీవుడ్‌ యంగ్‌ హీరో అఖిల్‌ అక్కినేని వివాహం శ్రీయా భూపాల్‌తో జరగాల్సింది. ఇద్దరి ఎంగేజ్‌మెంట్‌ను పెద్దల సమక్షంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే కొన్ని విషయాల్లో ఇద్దరికీ అభిప్రాయ భేదాలు రావడంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. హీరో ఉదయ్‌ కిరణ్‌.. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలను ఒప్పించారు. 2003లో ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకే కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. సుష్మిత.. విష్ణుప్రసాద్‌ను పెళ్లి చేసుకోగా, ఉదయ్‌కిరణ్‌.. బిషితను వివాహం చేసుకున్నాడు. 

ఇక ప్రేమలో మునిగి తేలుతూ పెళ్ళికి దగ్గరగా వెళ్లి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న జంటలేవో చూద్దాం. ‘నువ్వు లేక నేను లేను’ చిత్రంలో తరుణ్‌, ఆర్తీ అగర్వాల్‌ తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్ళపాటు ఎడతెరిపి లేకుండా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ప్రభుదేవా, నయనతారల ప్రేమ, పెళ్లి ప్రయత్నాలు ఇప్పటికీ అందరికీ విచిత్రంగానే అనిపిస్తాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దాని కోసం మతం మార్చుకోవడానికి కూడా నయనతార సిద్ధపడిరది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. ఎవరూ ఊహించని విధంగా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను విరమించుకున్నారు. ఇలా జరగడానికి కారణం ఏమిటి అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. నయనతార.. దర్శకుడు విఘ్నేష్‌ను వివాహం చేసుకోగా, ప్రభుదేవా ముంబాయికి చెందిన హిమానిని పెళ్లి చేసుకున్నాడు. 

బాలీవుడ్‌ నుంచి సౌత్‌కి వచ్చిన హన్సిక కూడా ప్రేమలో పడిరది. తమిళ్‌ హీరో శింబుని ప్రేమించింది. ఇద్దరూ కొన్నాళ్ళు ప్రేమలో మునిగి తేలారు. అతన్ని పెళ్ళి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పాలని డిసైడ్‌ అయింది హన్సిక. కానీ, ఒక్కసారిగా ఇద్దరి మధ్యా అగాధం ఏర్పడిరది. ఒకరినొకరు విమర్శించుకోవడం మొదలు పెట్టారు. అలా వీరిద్దరూ విడిపోయారు. ఇక బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి, అక్షయ్‌కుమార్‌ ప్రేమించుకున్నారు. తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు కూడా. కానీ, సీన్‌ రివర్స్‌ అయింది. డిరపుల్‌ కపాడియా కూతురు ట్వింకిల్‌ ఖన్నాను పెళ్లి చేసుకున్నాడు అక్షయ్‌. వ్యాపార వేత్త రాజ్‌ కుంద్రాను వివాహం చేసుకుంది శిల్పాశెట్టి.