Read more!

English | Telugu

ఎవ‌ర్‌గ్రీన్ బ్యూటీ రేఖ గురించి మీకు తెలీని ఏడు విష‌యాలు!

 

అంద‌చందాలు, అభిన‌య సామ‌ర్థ్యంతో అరుదైన తార‌గా పేరుపొందారు రేఖ‌. జెమినీ గ‌ణేశ‌న్‌, పుష్ప‌వ‌ల్లి దంప‌తుల కుమార్తె అయిన రేఖ మొద‌ట తెలుగులో ఒక సినిమాలో న‌టించి, ఆ త‌ర్వాత బాలీవుడ్ అవ‌కాశాల‌ను రెండు చేతులా అందిపుచ్చుకుని, వాటిని స‌ద్వినియోగం చేసుకొని, చాలా కాలం ప్రేక్ష‌కుల క‌ల‌ల‌రాణిగా వారి హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్నారు. అరుదైన అందగ‌త్తె అయిన ఆమె త‌ను చేసిన ప్ర‌తి పాత్ర‌తోనూ ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందారు. ఇవాళ 67 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనూ ఆమె గ్లామ‌ర్ చెర‌గ‌లేదు. బిగ్ స్క్రీన్‌పై అద్భుత‌మైన అభిన‌యాల‌ను ప్ర‌ద‌ర్శించిన రేఖ‌, ఫ్యాష‌న్ విష‌యంలోనూ ఐకాన్‌గా నిలిచారు. ఆమె గురించి చాలామందికి తెలీని నిజాలు...

1. త‌ల్లితండ్రుల త‌ర‌హాలో యాక్ట‌ర్ కావాల‌ని మొద‌ట్లో రేఖ అనుకోలేదు. ప్ర‌పంచాన్ని చుట్టి రావాల‌నేది ఆమె క‌ల‌. అందుకే ఎయిర్ హోస్టెస్ కావాల‌నుకున్నారు. యంగ్ ఏజ్‌లో ఎయిర్ హోస్టెస్‌ల‌తో స్నేహంచేసి, విదేశాల నుంచి బెస్ట్ మేక‌ప్ బ్రాండ్స్‌ను తెప్పించుకుంది. ఆమెకు మేక‌ప్ అంటే ఇష్టం.

2. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా సినీ కెరీర్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ధ‌ర్మేంద్ర‌, శ‌త్రుఘ్న సిన్హా, జితేంద్ర‌, సంజ‌య్ ద‌త్ లాంటి స్టార్స్ స‌ర‌స‌న న‌టించిన ఆమెకు లెజెండ‌రీ యాక్ట‌ర్ దిలీప్ కుమార్‌తో న‌టించే అవ‌కాశం ఎప్పుడూ రాలేదు. ఆమె తీర‌ని కోరిక‌ల్లో ఒక‌టిగా ఇది మిగిలిపోయింది.

3. రేఖ గొప్ప న‌టి మాత్ర‌మే కాదు, ఆమెలో చ‌క్క‌ని మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఉంది. యారానా మూవీలో నీతు సింగ్‌కు, వారిస్‌లో స్మితా పాటిల్‌కు డ‌బ్బింగ్ చెప్పారు.

4. ఫ్యాష‌న్ అంటే ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు ఒక ఐడ‌ల్‌గా నిలిచారు రేఖ‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, ఆమె ఎన్న‌డూ సొంత‌ స్టైలిస్ట్‌ను పెట్టుకోలేదు. త‌న రూపాన్ని, స్టైల్‌ను త‌నే డిజైన్ చేసుకుంటారు.

5. హిందీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఒక జిమ్‌లో పేరు న‌మోదుచేసుకున్న తొలి తార రేఖ‌. హోట‌ల్ ర‌మీ ఇంట‌ర్నేష‌న‌ల్‌లోని జిమ్‌లో ఆమె స్విమ్మింగ్‌, బేసిక్ ఎక్స‌ర్‌సైజ్‌లు ప్రాక్టీస్ చేసేవారు.

6. సినీ రంగంలో ఇవాళ హీరోయిన్లు ప‌లువురు ఒక‌రితో ఒక‌రు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు ఏ ఇద్ద‌రు హీరోయిన్లు ఫ్రెండ్స్ కాలేర‌నే నానుడి ఉండేది. కానీ రేఖ మాత్రం హేమ‌మాలినితో స‌న్నిహిత స్నేహం కొన‌సాగించారు.

7. రేఖ స‌మ‌య‌పాల‌న‌కు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ప్ర‌పంచంలోని మిగ‌తా అన్ని విష‌యాల‌కంటే ఆమె అత్య‌ధిక గౌర‌వం ఇచ్చేది టైమ్‌కే.