English | Telugu

డబ్బు అవసరం కాబట్టే చేశాను.. నిజం ఒప్పుకున్న సీనియర్ నటీమణి 


-వైరల్ గా మారిన నీనా గుప్తా వ్యాఖ్యలు
-ఎందుకు అలా చెప్పింది.
-ఆమె వ్యాఖ్యల్లోని మర్మం ఏంటి!

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి 'నీనా గుప్తా'(Neena Gupta)కి సగర్వం గా చెప్పుకునే సినీ లైనప్ ఉంది. 1982 లో 'సాత్ సాత్' అనే చిత్రంతో మొదలైన తన సినీ ప్రస్థానంలో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా గత ఏడాది వచ్చిన మెట్రో ఇన్ దినో, తు మేరీ మెయిన్ తేరా మెయిన్ తేరా తు మేరీ వంటి చిత్రాల వరకు కొనసాగుతూనే ఉంది. దీన్ని బట్టి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై నీనా గుప్తా చరిష్మా ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో తనకు ఇన్నాళ్లు సినీ కెరీర్ ని కొనసాగించడానికి గల రహస్యాన్ని చెప్పి షాక్ కి గురించి చేసింది. మరి ఆ విషయాలేంటో చూద్దాం.

నేను చేసిన కొన్ని సినిమాల్లోని క్యారెక్టర్స్ విషయంలో తప్పులు చేశాను. షూటింగ్ జరుగుతున్న రోజులు మొత్తం వాటిని ఎందుకు అంగీకరించానా అని బాధపడటంతో పాటు అవి రిలీజ్ కాకుండా ఉండాలని కోరుకున్నాను. ఆ క్యారెక్టర్స్ చేసేటప్పుడు సెట్ లో ఎన్నో సార్లు అవమానాలు ఎదుర్కొన్నాను. కొంత మంది దర్శకురాలు అయితే కారణం లేకుండానే సెట్ లో నన్ను తిట్టేవారు. కేవలం డబ్బు అవసరం కాబట్టే ఆ చిత్రాలన్నీ చెయ్యడంతో పాటు ఎన్నో మాటలు అన్నా కూడా భరించాను. ఒక వేళ ఆ టైంలో వేరే చిత్రాల్లో ఆఫర్స్ వచ్చి ఉంటే ఆ చిత్రాలు చేసే దానిని అని నీనా గుప్తా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా నిలిచాయి.

Also read:ఆది సీక్వెల్ కి ఆ హీరో, ఆ దర్శకుడు ఓకేనా!

కెరీర్ మొదట్లో మంచి చిత్రాల్లోనే చేసిన నీనా గుప్తా ఆ తర్వాత రొమాన్స్ తరహా చిత్రాల్లోను తన సత్తా చాటింది. ఆ జోరు లేటు వయసులోను సిల్వర్ స్క్రీన్ పై కనపరిచింది. అందుకే ఆమె ఆ తరహా వ్యాఖ్యలు చేసింది. పలు టెలివిజన్ షోస్ లోను సత్తా చాటి లెక్కలేనంత అభిమానులని సంపాదించిన నీనా గుప్తా 1977 లో అమలన్ అనే ఆయన్ని పెళ్లి చేసుకోగా, వన్ ఇయర్ కే ఆ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్ విప్ రిచర్డ్స్ తో రిలేషన్ లో ఉంది. ఆ ఇద్దరు పెళ్లి చేసుకోకుండానే మసభ గుప్తా అనే అమ్మాయికి జన్మని ఇచ్చారు. మసభ గుప్తా ఇప్పుడునటితో పాటు ఫ్యాషన్ డిజైనర్. 2008 లో వివేక్ మెహ్రా ని నీనా గుప్తా రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం నీనా గుప్తా ప్రధాన క్యారక్టర్ లో తెరకెక్కిన వద్ పార్ట్ 2 ఈ నెల 6 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.