English | Telugu

వెంక‌టేశ్ 'వ‌సంతం'కి 20 ఏళ్ళు.. క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అతిథి పాత్ర‌లో మెరిసిన సినిమా!

ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్స్ అన‌గానే ఠ‌క్కున గుర్తొచ్చే క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేశ్ ఒక‌రు. ఈ జాన‌ర్ లో వెంకీ న‌టించిన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. వాటిలో 'వ‌సంతం' సినిమా ఒక‌టి. ఆడ‌, మ‌గ స్నేహం చుట్టూ అల్లుకున్న ఈ చిత్రంలో వెంక‌టేశ్ కి జోడీగా ఆర్తి అగ‌ర్వాల్ న‌టించ‌గా, స్నేహితురాలి పాత్ర‌లో క‌ళ్యాణి ద‌ర్శ‌న‌మిచ్చింది.  ఆకాశ్, సునీల్, చంద్ర‌మోహ‌న్, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హేమ‌, ఆహుతి ప్ర‌సాద్, కొండ‌వ‌ల‌స‌, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం, ఎల్బీ శ్రీ‌రామ్, ప్ర‌సాద్ బాబు, సూర్య‌, వైజాగ్ ప్ర‌సాద్, శివారెడ్డి, మాస్ట‌ర్ తేజ‌ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించారు. క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అతిథి పాత్ర‌లో మెరిశారు. 'సూర్య‌వంశం' మాతృక ద‌ర్శ‌కుడైన‌ విక్ర‌మ‌న్.. తెలుగులో నేరుగా రూపొందించిన తొలి సినిమా ఇదే కావ‌డం విశేషం.

ఈవీవీ 'క‌న్యాదానం'కి పాతికేళ్ళు.. అప్ప‌ట్లో వినూత్న క‌థాంశంతో తెర‌కెక్కిన సినిమా!

ఓ ఆడ‌పిల్ల తండ్రి.. క‌న్యాదానం చేయ‌డ‌మ‌న్న‌ది అనాదిగా ఉన్న వ్య‌వ‌హార‌మే. అయితే.. త‌న భార్య‌ ప్రేమించిన వ్య‌క్తికే ఆమెని క‌న్యాదానం చేసిన భ‌ర్తని మాత్రం క‌నివిని ఎరుగం. అలాంటి  ఓ భ‌ర్త క‌థే.. 'క‌న్యాదానం' చిత్రం. వినూత్న క‌థాంశాల‌కు చిరునామాగా నిలిచిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ తెర‌కెక్కించిన ఈ సినిమాలో భ‌ర్త‌గా శ్రీ‌కాంత్, భార్య‌గా ర‌చ‌న న‌టించ‌గా.. ప్రియుడు పాత్ర‌లో ఉపేంద్ర (తెలుగులో త‌న‌కిదే తొలి చిత్రం) అల‌రించాడు. కోట శ్రీ‌నివాస‌రావు, బ్ర‌హ్మానందం, ఎమ్మెస్ నారాయ‌ణ‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, క‌విత‌, శివాజీ, రాజీవ్ క‌న‌కాల‌, గోకిన రామారావు, వినోద్ బాల, మాధ‌విశ్రీ (వ‌ర్ష) ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. 

సంచ‌ల‌న 'సింహాద్రి'కి 20 ఏళ్ళు.. అప్ప‌ట్లో 'సింగ‌మ‌లై' దెబ్బ‌కి బాక్సాఫీస్ అబ్బా అనేసింది!

కొన్ని కాంబినేష‌న్స్ అంతే గురూ! ఏదో మంత్ర‌మేసిన‌ట్టు.. జ‌ట్టుక‌ట్టిన ప్ర‌తీసారి హిట్టుకొట్టేస్తుంటాయి. అలాంటి మ్యాజిక‌ల్ కాంబోల్లో.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సో స్పెష‌ల్ అంతే. ఈ ఇద్ద‌రు క‌లిస్తే మాత్రం.. రికార్డుల ఊచ‌కోతే. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన మొద‌టి చిత్రం 'స్టూడెంట్ నెంః 1' సూప‌ర్ హిట్ గా నిలిస్తే.. ఆపై వ‌చ్చిన 'సింహాద్రి', 'య‌మ‌దొంగ‌', 'ఆర్ ఆర్ ఆర్' సరికొత్త రికార్డులు సృష్టించాయి. మ‌రీ ముఖ్యంగా.. 'సింహాద్రి' అయితే ఊర మాస్ ఆడియ‌న్స్ ని ఓ రేంజ్ లో మెస్మ‌రైజ్ చేసిప‌డేసింది. 

మూడు ద‌శాబ్దాల‌ 'కొండ‌ప‌ల్లి రాజా'.. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విశేషాలు మీ కోసం!

'చంటి'(1992)తో తెలుగునాట‌ ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన కాంబినేష‌న్.. విక్ట‌రీ వెంక‌టేశ్, స్టార్ డైరెక్ట‌ర్ ర‌విరాజా పినిశెట్టిది. ఆ చిత్రం త‌రువాత ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సినిమా 'కొండ‌ప‌ల్లి రాజా'(1993). 'చంటి' ఎలాగైతే రీమేక్ మూవీనో.. 'కొండ‌ప‌ల్లి రాజా' సైతం రీమేక్ చిత్రం కావ‌డం విశేషం. త‌మిళ సినిమా 'చిన్న తంబి' (1991) ఆధారంగా 'చంటి' తెర‌కెక్కితే.. 'కొండప‌ల్లి రాజా' కూడా 'అణ్ణామ‌లై' (1992) అనే త‌మిళ చిత్రం ఆధారంగా రూపొందింది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. 'అణ్ణామ‌లై' కూడా రీమేక్ నే. 1987లో విడుద‌లైన హిందీ చిత్రం 'ఖుద్ గ‌ర్జ్' ఆధారంగా  'అణ్ణామ‌లై' త‌యారైంది. అయితే, 'అణ్ణామ‌లై' కంటే ముందు 'ఖుద్ గ‌ర్జ్'కి రీమేక్ గా తెలుగునాట 'ప్రాణ స్నేహితులు' (1988) (కృష్ణంరాజు, శ‌ర‌త్ బాబు, రాధ‌) రూపొంద‌డం విశేషం. అంటే.. 5 ఏళ్ళ వ్య‌వ‌ధిలో ఒకే క‌థ‌తో 'ప్రాణ స్నేహితులు', 'కొండ‌ప‌ల్లి రాజా' తెర‌కెక్కాయ‌న్న‌మాట‌.  మ‌రో విష‌య‌మేమిటంటే.. ఇటు 'ప్రాణ స్నేహితులు'లోనూ, అటు 'అణ్ణామ‌లై'లోనూ హీరోకి ఫ్రెండ్ గా శ‌ర‌త్ బాబు న‌టించారు.