English | Telugu

బోన్ ఫ్రాక్చర్ తో నీతోనే డాన్స్ షో నుంచి తప్పుకున్న నేహా చౌదరి

నేహా చౌదరి నీతోనే డాన్స్ సీజన్ 2 లో విశ్వతో కలిసి పెర్ఫార్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఈ వారం ఎపిసోడ్ లో ఈ జోడి కనిపించలేదు. ఐతే ఈ వారం ప్రసారం ఐన షోలో అన్ని జోడీస్ పెర్ఫార్మ్ చేసాక చివరిగా స్టేజి మీదకి విశ్వా-నేహా వచ్చారు. ఐతే మెడకు బెల్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఐతే తనకు మీద దగ్గర హెయిర్ లైన్ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పింది. షూటింగ్ స్టార్ట్ ఐన దగ్గర నుంచి ఆ నొప్పిని అలాగే భరిస్తూ చేస్తున్నాను  కానీ ఇంకా పెయిన్ ఎక్కువైపోయేసరికి భరించలేక హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్స్ అసలు విషయం  చెప్పారని చెప్పింది.

Eto Vellipoindi Manasu: బొమ్మని గీస్తే నీలాగుంది.. తనవల్ల ఇబ్బందిరాదని మాటిచ్చిన భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -83 లో.. సీతాకాంత్ కోపంగా రామలక్ష్మిని తీసుకొని లోపలికి వచ్చి.. నీ మైండ్ వర్క్ చెయ్యడం లేదా? మనం ఏ సిచువేషన్ లో ఉన్నాం.. నువ్వేం చేస్తున్నావ్? ఈ రాత్రి అభిని నువ్వు కలవడం అవసరమా అని రామలక్ష్మిని సీతాకాంత్ తిడతాడు. అంటే నన్ను చూడాలని అన్నాడు.. కన్నీరు పెట్టుకున్నాడని రామలక్ష్మి అంటుంది. అదంతా అభి కావాలనే చేస్తున్నాడు. లేకపోతే ఇంత రాత్రి రావడం అవసరమా? ఇంట్లో వాళ్ళు చూస్తే పరిస్థితి ఏంటని సీతాకాంత్ కోప్పడతాడు.