Home » Rasi Phalalu » ధనస్సు రాశి రాశిఫలాలు 2015

ధనస్సు రాశి -  మూల 1,2,3,4 (యే,యో,బా,బీ)
పూ.షా.1,2,3,4(బూ,ధా,భా,ఢా),ఉ.షా.1(బే)
   ఆదాయము వ్యయం 8 రాజపూజ్యం 6 అవమానం
1

 

ఈ రాశి వారికి గురువు వత్సరాది 14.7.15వరకు అనగా అధిక ఆషాఢ బ.త్రయోదశి మంగళవారం వరకు 8వ స్థానము తామ్రమూర్తిగా యుండును. తదుపరి వత్సరాంతము 9వ స్థానమున తామ్రమూర్తిగానే యుండును. శని వత్సరాది వత్సరాంతము 12వ స్థానమున తామ్రమూర్తిగానే యుండును. రాహు,కేతువులు వత్సరాది 29.1.16 అనగా పుష్య బ.పంచమి శుక్రవారము వరకు రాహువు 10వ స్థానమున కేతువు 4వ స్థానమున రజితమూర్తులై యుందురు. తదుపరి వత్సరాంతము రాహువు 9వ స్థానమున కేతువు 3వ స్థానమున తామ్రమూర్తులై యుందురు. ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా ఏలినాటి శని ప్రభావము మరియు సం||ము పూర్వార్ధము గురుబలము కూడా అనుకూలముగా లేనందున జీవితములో ప్రతి కార్యమును ఆలోచించి శ్రేయోభిలాషుల సలహామేరకు నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా మాటలు వాడిగా, వేడిగా అనాలోచితము ఇతరుల మనస్సును గాయపరచకుండా ఉండాలి. ఆలోచనలు స్థిరముగా నుండక, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక, అర్థంకాని అయోమయ స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగములో ప్రత్యక్షంగా మీకు హితులు అన్నకున్న వారే పరోక్షముగా మీ గురించి వ్యతిరేకముగా మాట్లాడతారు. వెనక గోతులు తీసేవారున్నారని తెలిసి ఆశ్చర్యము, ఆవేదన కలుగుతుంది. ఆలస్యముగా వాస్తవాన్ని గ్రహించామని బాధపడతారు. పై అధికారుల వత్తిడివలన తమ విద్యుక్త ధర్మాన్ని సరిగా నిర్వహించలేక ఎటూ తేల్చుకోలేని స్థితి ఏర్పడుతుంది. ఎండమావులను చూసి ప్రలోభపడకుండా ఒకానొక సందర్భములో ఉద్యోగము మారాలని, రాజీనామా చేయాలనే ఆలోచనలు కూడా రావచ్చును. కాని జాగ్రత్త ఓపికపట్టండి. తరువాత మనోవాంఛ నెరవేరుతుంది.


అతిసులభముగా పూర్తి కావలసిన పనులకు ఎక్కువగా శ్రమించ వలసిన పరిస్థితి వృధా భ్రమణము కనపడుచున్నది. ఎంత చాకచక్యముగా ఆలోచనలు చేసినా అవి కార్యరూపం దాల్చకపోవడం మరియు తమ ముందు నిల్చుని మాట్లాడటానికి ధైర్యము చాలనివారు సైతము మీకు సలహాలు ఇవ్వడము ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. కాలమహిమ అంటే ఇదేనని తెలుసుకుంటారు. ఎంత సహనంతో ఉండాలని ప్రయత్నించినా మీ సహనాన్ని, మౌనాన్ని భంగపరచువారు ఎదురవుతారు. అనవసరమైన, అకారణమైన నిందలకు గురి కావాల్సివస్తుంది. లోకం దృష్టిలో కోటీశ్వరులు కాని వాస్తవానికి ఆర్థిక ఇబ్బందుల గురించి ఎవరికి చెప్పుకున్నా నమ్మె పరిస్థితి ఉండదు. వత్సరారంభంలో 4 నెలల కాస్త సంయమనము పాటించినా జులై నుండి గురు బలము చేత శనిప్రభావము తగ్గును. ప్రయోజనము లేని విషయాలపై ఆసక్తి చూపిస్తారు. అనాలోచిత నిర్ణయాలు, అకారణ ద్వేషాలు, స్వయంకృతాపరాధము కాగలదు. కొన్ని సందర్భాలలో లేనిది ఊహించుకొని భయపడే అవకాశము గలదు. ఏలినాటి శని ద్వితీయ భ్రమణము వారికి సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే అవకాశము గలవు.  చిన్న పనిని కూడా పెద్దగా ఆలోచించడము, ఆ పని పూర్తి అయ్యేవరకు నమ్మకము లేకపోవుట జరుగును. సహవాసము వలన ప్రతిష్ఠ భంగపడే అవకాశము గలదు. స్నేహాలు అనగా స్త్రీ, పురుషుల స్నేహాల విషయంలో నియంత్రణ అవసరము. మీ వెనక మీ కుటుంబము కూడా ఉన్నదని ఆలోచించాలి. ఒక చిన్న చెడు సలహా చేత వారి మాటలు ఇంపుగా అనిపించుటచేత, ఇంతకాలము సంపాదించిన ప్రతిష్ఠకు భంగము కలుగవచ్చును. ధర్మాధర్మ విచక్షణ చేయండి. చెప్పుడు మాటలు ఆత్మీయతలను దూరం చేస్తాయి. ఆదాయ వనరులు పెంచుకోవాలని విపరీతమైన ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో అశాంతి, దాంపత్య జీవితములో సమస్యలు, మాతా పితరుల ఆరోగ్య సమస్యలు ఉద్యోగములో తీవ్రమైన పని వత్తిడి మొదలగు సమస్యలు బాధించే అవకాశము గలదు. చోరభయం గలదు. ప్రభుత్వము, నివాస స్థలంగాని, ఉద్యోగంలో మార్పుగాని సంభవించవచ్చును. ఇష్టంలేని ప్రదేశాలకు స్థానచలనం మానసిక వత్తిడి కాని పైకి కనిపించనీయరు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కాలేయము, బిపి,షుగరు సమస్యల విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. విలువైన వస్తువులు జాగ్రత్తగా దాచుకోవాలి. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్త, అనవసర అహంభావము మితిమీరిన అనారోగ్యకరమైన ఆత్మ విశ్వాసము పనికిరాదని తెలుసు కోవాలి. చట్టపరమైన విషయంలో జాగ్రత్తలు అవసరము. కోర్టు గొడవలు, పోలీస్‌ స్టేషనులు వాటి పట్ల దూరంగా ఉండడం ఉత్తమం. ప్రమాద సూచన గలదు. తల్లిదండ్రులకు దూరంగా నివసించం, స్నేహితులతో, బంధువులతో తగిన సహాయ సహకారాలు లభించకపోవచ్చును. అధిక ధనవ్యయము, ఎంత నియంత్రించాలకున్నా సాధ్యము కాకపోవుట, కొందరు ఉద్యోగులకు ప్రభుత్యోగులకు శాఖాపరమైన చర్యలు, వివాదాస్పదమైన ఆస్తులు, భూముల జోలికి వెళ్ళకండి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరము. సోదరుల మధ్య అకారణ కలహాలు, క్రోధము అధిక మగుట చాలా తెలివిగా పనులు చేస్తారు. కాని మానసిక వత్తిడి మాత్రము తప్పదు. ప్రభుత్వ అధికారుల, రాజకీయ నాయకుల పరిచయము హోదా లభించవచ్చును. ఆర్థిక ఇబ్బందులు, ఋణ బాధలు, స్థిరాస్థిని అమ్మకానికి పెట్టుట, తంత్ర విద్యలపై ఆసక్తి పెరుగుట, లాటరీలకు, జూదాలకు దూరంగా ఉండండి. మాతృ ఆరోగ్యము కలవర పరచు అవకాశము, విద్యాపరమైన ఉన్నతి. విద్యార్థులకు అధికంగా శ్రమించిన ఫలితము లభించగలదు. ఊహలు, సోమరితనం దరికి రానివ్వకండి. సం||ర మధ్యకాలంలో జ్ఞాపకశక్తి, పోటీ పరీక్షలలో విజయం సాధించుట, పోయిన గౌరవము తిరిగి పొందుట జరుగవచ్చును. స్థిరాస్థులు వివాదాస్పదమగుట. అగ్ని, విద్యుత్తు మొదలైన విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఉదర సమస్యలు, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి, చివరలో వంశపారంపర్య ఆస్తుల విషయమై సమాచారము లభించును. ఆత్మస్థైర్యం పెరుగుట, శతృవులపై క్రమముగా పై చేయి సాధించుట ఆదాయపు మార్గాలు పెరుగుట, వృత్తిపరముగా పేరు, ప్రతిష్టలు పెరుగుట, జనాకర్షణ తీర్థయాత్రా సందర్శన, చర్మ సంబంధమైన సమస్యలు బాధించుట, సమయాన్ని వీలయినంతవరకు ఉపయోగించుకునే ప్రయత్నం. కన్యాదాన ఫలము గలదు. అవివాహితులకు వివాహప్రాప్తి.  పుత్రసంతాన ప్రాప్తి జంతుభయము, ఉద్యోగస్తులు, వ్యాపారులు ప్రభుత్వ అధికారులు అవినీతికి దూరంగా ఉండండి. నేర పరిశోధన వారి దృష్టి మీపై ఉంటుందని మరవకండి. సంవత్సరం చివరలో వ్యాపారస్తులకు కొంత ఉపశమనము లభించగలదు. భాగస్వామ్య వ్యాపారులపై అధిపత్యము క్రమంగా పెరుగగలదు. నష్టపోయిన ప్రతిష్ట, పరపతిని తిరిగిపొందుతారు. ఇతర రాష్ట్రాలలో వ్యాపార అవకాశాలు లభించవచ్చును. కళాకారులు ప్రయాసచే పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపారస్థులు తొందరపడి ప్రస్తుతమున్న వ్యాపారమును మానివేసి నూతన వ్యాపారములు, నూతన ప్రదేశాలకు వెళ్ళాలనే యోచన చేస్తారు. విద్యార్థులకు సం||రం మధ్యనుండి బాగుంటుంది. శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. మేధస్సు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. స్నేహాలు, ఇతర వ్యసనములు వక్రమార్గంలో నడిపిస్తాయి. జాగ్రత్త, స్త్రీలు తరచూ మనస్సు నిరాశ పరచుకుంటారు. జీవిత భాగస్వామి సలహాపాటించిన మేలు జరుగును. ప్రాణమితృలు, మీ శ్రేయోభిలాషులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తపడండి. చివరలో విదేశీయాన అవకాశాలు సఫలం కావచ్చును. విదేశాలలో ఉన్నవారికి శాశ్వత యోగ్యత, వర్క్‌ పర్మిట్‌ లభించవచ్చును. స్త్రీలకు సహజంగా ఏర్పడే కొన్ని ఆరోగ్య సమస్యలు కలవరపరుస్తాయి. నూతన విద్యయోగ్యతా పత్రాలు పొందుతారు. శరీరానికి ముఖకాంతి తగ్గడం, చర్మ సమస్యలు నూతన స్నేహాలు విస్మయానికి గురిచేస్తాయి. అభద్రతా భావం వదలండి. ఇష్టదైవాన్ని, గ్రహదైవాన్ని ఆరాధించండి. తల్లిదండ్రులను ఆదరించండి. వృద్ధులకు సాయం చేయండి. గోసేవ, జీర్ణ దేవాలయాలకు సహాయము, శ్రేయోభిలాషులకు మేలు చేయుట, విద్య ద్వారా మొదలైన అంశాలు గ్రహబాధ నుండి విముక్తడిని చేస్తాయి. ప్రత్యేక శని స్తోత్రపారాయణం శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణం మేలు చేస్తుంది.