Home » Rasi Phalalu » కర్కాటకరాశి రాశిఫలాలు 2015

కర్కాటకరాశి -  పునర్వసు 4(హీ)
      పుష్యమి 1,2,3,4(హూ,హే,హో,డా)- ఆశ్లేష 1,2,3,4(డీ,డు,డె,డో)
   ఆదాయము 5  వ్యయం 5 రాజపూజ్యం 5 అవమానం
2

 

ఈ రాశివారికి గురువు వత్సరాది 14.7.15 అనగా అధిక ఆషాఢ బ.త్రయోదశి మంగళవారము వరకు 1వ స్థానమున లోహమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతము 2వ స్థానమున లోహమూర్తిగానే యుండును.  శని వత్సరాది వత్సరాంతము పంచమస్థానమున లోహమూర్తిగానే యుండును. రాహుకేతువులు 29.1.16 అనగా పుష్య బ. పంచమి శుక్రవారము వరకు రాహువు 3వ స్థానమున, కేతువు 9వ స్థానమున తామ్రమూర్తులై ఉందురు. తదుపరి వత్సరాంతము రాహువు 2వ స్థానమున కేతువు 8వ స్థానమున తామ్రమూర్తులుగానే యుందురు.

    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించగా శుభాశుభ మిశ్రమ ఫలితములు కనపడుచున్నవి. ఎంత శ్రమించినా
ఆర్థికపరమైన అవస్థలు. అనవసరమైన ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి. వృత్తిలో చాలా ఓర్పు అవసరము. అనవసరమైన ఆవేశమునకులోను కాకూడదు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నించినా మీ సహనమే మీకు శ్రీరామరక్ష అని తెలుసుకోవాలి. ఉద్యోగములో తీవ్రమైన సలహాలు ఇచ్చేవారు ఉంటారు. తస్మాత్‌ జాగ్రత్త మీలో ఎంత నైపుణ్యము ఉన్నా దానిని నిరూపించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయానికి సహనము అవసరము ఎంత ఫలితము అయితే ఆశిస్తున్నారో ఆ ఫలితము విషయంలో కొంత సర్దుకుపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్థానచలనము సూచనగలదు. కాని మీకై మీరు స్థానచలనాన్ని ఆహ్వానించకండి. కొద్దిగా వేచిచూసిన మీరు కోరుకున్న స్థానము, స్థాయి లభించవచ్చును. ఈ రాశివారికి సంవత్సరపు ప్రథమార్థము కన్నా ద్వితీయార్థము కొంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో వాత సంబంధమైన వ్యాధులు బాధించవచ్చును. ఔషధ సేవనము తప్పకపోవచ్చును. అకారణ కలహాలకు ఆహ్వానము పలుకకండి. బంధువులు మిత్రులు, శ్రేయోభిలాషులు మీ ప్రవర్తన వల్ల దూరం చేసుకునే అవకాశము. రక్త సంబంధీకులతో తోబుట్టువులతో అకారణ కలహసూచన. నూతన కార్యములు ఆరంభించునపుడు ఒకింత ఆలోచించి మంచి చెప్పేవారు ఎవరైనా తనవారేనని ఆలోచించి వారి సలహామేరకు నడుచుకోవాలి. చిత్త చాంచల్యము దరికి రానివ్వకండి. స్త్రీ, పురుష స్నేహాల విషయంలో కొంత నియంత్రణ. జాగ్రత్తలు అవసరము. నీచ జన సహవాసము గలదు. తాను చేయని పనికి సంజాయిషీ చెప్ప వలసిన పరిస్థితి ఏర్పడే అవకాశము గలదు. వత్సరారంభములో స్థిర, చరాస్థులను కాపాడుకునే ప్రయత్నము చేయండి. ఆరోగ్య విషయంలో ఏ మాత్రము అజాగ్రత్త పనికిరాదు. అధిక ధన వ్యయము సూచించుచున్నది. గృహములో అనవసరమైన వివాదాలకు అవకాశము ఇవ్వకండి. స్నేహితులతో అనగా సహవాస దోషము కనపడుచున్నది. తస్మాత్‌ జాగ్రత్త. స్త్రీ మూలక భయము. అలోచనా శక్తి లోపించి ఎవరు తనవారో, ఎవరు పరాయి వారో తెలుసుకొనుట కష్టమవుతుంది. ఏదో తెలియని భయము అవరిస్తుంది. అకారణంగా తమకు సంబంధము లేని విషయాలకు శిక్ష అనుభవించడం ఉద్యోగస్తులకు పై అధికారుల చేత విపరీతమైన విసుగు కలుగుట సంభవించవచ్చును. తొందరపడి క్షణికావేశముతో నిర్ణయాలు తీసుకొనకూడదు. నాలుగు నెలలు ఓపిక పట్టండి. ప్రశాంతత పోయిన గౌరవము తిరిగి పొందుట మొదలైన శుభాలు లభిస్తాయి. ప్రభుత్వ పరమైన చికాకులు, అందవలసిన అనుమతులు అందటము అలస్యమవుట, చెల్లించవలసిన బకాయిలు చెల్లించనందుకు ఇబ్బందులు మధ్యస్థులను నమ్మి మోసపోవుట కనబడుచున్నది. సరియైన సమయంలో సరియైన నిర్ణయము తీసుకోవడము కష్టతరమవుతుంది. ఇతరుల సలహాలు తీసుకోవడంలో అభిమానము అడ్డువస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలని ఉపాయము చేస్తారు. అవినీతిమయమైన ఆలోచనలను దరికి రానివ్వకండి. నీచ జన సహవాసము ఇబ్బందికరముగా మారవచ్చును. సంశయాత్మకము ఎటూ అర్థంకాని పరిస్థితులు ఎదురయ్యే అవకాశము కలదు. సంతానము యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అనారోగ్య కారణముగా తమ సంతానము యొక్క విద్యా విషయంలో అడ్డంకులు ఏర్పడే అవకాశము కలదు. సంతానము తమ మాట వినక  స్నేహాల విషయంలో కొంత అజాగ్రత్త చేత అపనిందలు భరించవలసిన పరిస్థితి, తమ సంతానము దారి తప్పకుండా నియంత్రించవలసిన భాద్యత తమదేయని గ్రహించండి. సెల్‌ఫోను వల్ల సమస్యలు ఉత్పన్నం కావచ్చును. వత్సరారంభంలో ఈ రాశివారు వ్యాపారంలో సాహస నిర్ణయాలు తీసుకొనకుండా మంచి సమయం కొరకు వేచి చూడండి. వాహనాలు జాగ్రత్తగా నడపండి. ఇతరులతో వివాదాలు, సవాలు ఛాలెంజ్‌లు చేయుట మొదలైనవి ఇబ్బందికరముగా మారవచ్చును. మొండితనము మూర్ఖత్వము దరిరానీయకండి. లాటరీలు జూదాలకు బెట్టింగులకు దూరంగా ఉండండి. మీకు మీరు ఒక ప్రత్యేక వ్యక్తిగా కనిపించాలనే తపన పెరుగుతుంది. కుమారుడు కోడలు మొదలైన వారితో విభేదాలు తమ ఆస్తులు వివాదాస్పదము కాకముందే జాగ్రత్తపడండి. వివాదాస్పద ఆస్తులు కొనుగోలు చేయరాదు. సంప్రదాయంపై నమ్మకము సన్నగిల్లుతుంది. అయితే ఇది అంతయు సం||ము పూర్వార్థములోనే ఒక 4 నెలలు కాస్త ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేటినట్లయితే జులై 14 నుండి బృహస్పతి బలము  అనుకూలించుటచేత అనేక సమస్యల నుండి బయటపడతారు.

అవివాహితులకు వివాహ సంబంధాలు నిశ్చయమగుట వివాహప్రాప్తి. ఇష్టకామ్యార్థసిద్ధి గతంలో అనుభవించిన మానసిక సంఘర్షణగా చక్కని పరిష్కారము లభిస్తుంది. మీలో ఉన్న తెలివి తేటలను సరియైన విధముగా ఉపయోగించగలుగుతారు. సంతానప్రాప్తి విద్యార్థులకు ఆలోచనా శక్తి పెరుగుతంది. పోటీ పరీక్షలలో చక్కని విజయాన్ని సాధిస్తారు. కోల్పోయినటువంటి గౌరవ మర్యాదలను తిరిగి పొందుతారు. శతృవులు మిత్రులౌతారు. ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారము లభిస్తుంది. దాంపత్య జీవన సౌఖ్యము అనుభవిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా స్థాయి పెరుగుతుంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి. చెడు సలహాలు మాత్రం ఇచ్చేవారుంటారు. జాగ్రత్త. నూతన వ్యాపారం ఆరంభించుట. వ్యాపార భాగస్వాములపై అధిపత్యము చెలాయించుట. పరిస్థితులు తమ నియంత్రణలో వచ్చుట. సంఘసేవా కార్యక్రమాలు చేయుట, గోసేవ, యజ్ఞయాగాది క్రతువులయందు పాల్గొనుట మొదలైన పుణ్య కార్యాచరణ. స్థిర చరాస్థులు వృద్ధి చేసుకుంటారు. జీవితంలో ఆశయసాధనకు చక్కని మార్గమును నిర్ణయించుకుంటారు. నూతన స్నేహాలు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళాలనే తపన సాకారమవుతుంది. విదేశాలలో ఉన్న వారికి శాశ్వత స్థిరనివాసమ అనుమతి లభించ వచ్చును. శతృవులపై అధిపత్యము సాధిస్తారు. కళారంగములోని వారికి రెండవ ప్రయత్నంగా మంచి అవకాశాలు లభిస్తాయి. ఋణాలు చేయునపుడు అవసరానికి మించి అప్పుచేయకుండా నియంత్రణ అవసరము. ఉదర సంబంధ  సమస్యలు, పొత్తి కడుపు క్రింది భాగములో సమస్యలు ఔషధసేవనము. స్వంత ఇంటి నిర్మాణానికై మీరు చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆత్మస్థైర్యము పెరుగుతుంది. నూతన పెట్టుబడులకు ప్రయత్నాలు, దారి లభించుట.
   
రాహుకేతువుల ప్రభావము వలన వత్సరారంభములో శతృవుల ఎన్ని విధాలుగా మిమ్ములను అవస్థల పాలు చేయాలనుకున్నా సమయం కోసం వేచి చూసి మీరేమిటో నిరూపిస్తారు. అప్రయత్న ధనప్రాప్తి. వివాహ నిశ్చయసూచన. బంధువులకు, స్నేహితులకు ఇచ్చిన ధనం తిరిగిరాదనుకున్నది తిరిగి లభించును. నూతన విద్యలకై విదేశాలకు వెళ్ళుట. కనిష్ఠ సోదరుడి విద్యాభివృద్ధికై మీ వంతు పాత్ర నిర్వహిస్తారు. వాహన వ్యాపారులు విశేషంగా సంపాదిస్తారు. ధైర్యము పెరుగుతుంది. ఇతర సంప్రదాయ, మతాంతర, కులాంతర స్త్రీ, పురుషుల స్నేహాలు ఎర్పడుట, గర్భధారణ జరిగిన స్త్రీలు ప్రసూతి వరకు తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను. విషజంతు భయము. కంటి దంత సమస్యలు, దూరప్రాంత ప్రయాణాలు చేయునపుడు తగు జాగ్రత్తలు అవసరము. మత ఛాందసవివాదాలకు దూరంగా ఉండండి. తండ్రి ఆరోగ్య విషయంలో అజాగ్రత్త పనికిరాదు. విలువైన వస్తువులు సువర్ణాభరణములు తగు జాగ్రత్తగా దాచుకోవాలి. చోరభయము కనబడుచున్నది. భార్య తరపున బంధువులతో వివాదములు. తాంత్రిక విద్య అభ్యసించిన వారి పరిచయాలు. జ్వరబాధ, దీర్ఘకాలిక వ్యాధులకు లేదా తప్పని సరి పరిస్థితులలో శస్త్రచికిత్స. అల్సరు, చర్మబాధలు బాధించవచ్చును. మధ్యవర్తిత్వము చేయునపుడు తగు జాగ్రత్తలు అవసరం. తమ సంతానాన్ని ఉన్నత విద్యలకై విదేశాలకు పంపే ప్రయత్నము సఫలమవుతుంది. కోర్టు వివాదములు మధ్యవర్తిత్వము ద్వారా పరిష్కరించుకుంటారు. మొత్తం మీద ఈ రాశివారలకు గురుబలం వల్ల మేలు జరిగినా కాని అనేక చికాకుల నుండి విముక్తి కొరకు, గోసేవ, శని, రాహు, కేతు జపదానాలు. శ్రీరామరక్షాస్తోత్ర పారాయణం. కృష్ణాష్టకము చేసిన మేలు జరుగును. అనాధ స్త్రీలకు వివాహం కొరకు సహాయం, అర్థించే వారికి తమకు తోచిన సహాయం చేయండి. శుభాలు పొందండి.