Home » Rasi Phalalu » కుంభ రాశి రాశిఫలాలు 2015

కుంభ రాశి -  ధనిష్ఠ 3,4 (గూ,గే)
శతభిషం 1,2,3,4(గో,సా,సీ,సు),పూ.భా.1,2,3(సే,సో,దా)
   ఆదాయము 5  వ్యయం 2 రాజపూజ్యం 5 అవమానం
4

 

ఈ రాశివారికి గురువు వత్సరాది 14.7.15 వరకు అనగా అధిక ఆషాఢ బ.త్రయోదశి మంగళవారం వరకు 6వ స్థానమున సువర్ణమూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతము 7వ స్థానమున రజితమూర్తియై ఉండును. శని వత్సరాది వత్సరాంతము 10వ స్థానమున సువర్ణమూర్తియై ఉండును. రాహుకేతువులు వత్సరాది 29.1.16 అనగా పుష్య బ.పంచమి శుక్రవారం వరకు రాహువు 8వ స్థానమున కేతువు 2వ స్థానమున లోహమూర్తులుగా ఉండెదరు. తదుపరి వత్సరాంతము రాహువు 7వ స్థానమున, కేతువు 1వ స్థానమున లోహమూర్తులుగానే యుందురు.

ఈ విధమైన గ్రహస్థితి ఆధారముగా పరిశీలించగా శుభాశుభ మిశ్రమ ఫలితములు కనపడుచున్నవి. ప్రతి విషయంలోనూ సహనము, చాలా అవసరము అనవసరమైన చికాకు, క్రోధము దరికి రానీయకండి. సంవత్సరము పూర్వార్ధము అనగా జులై 14వరకు కొంత ఓపిక అవసరము. తొందరపాటు ఏ మాత్రము పనికిరాదు. వ్యాపారంలో పోటీదారులపై తెలివిగా ప్రవర్తించవలసిన సమయము. తమవారు ఎవరో, పరాయి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపార రహస్యాలను తెలివిగా, ఇతరులకు చేరకుండా ప్రవర్తించండి. చిన్న విషయానికి కూడా ఎక్కువగా కష్టపడి కృషి చేయవలసిన సమయము, అనూహ్యముగా అనాలోచితముగా ధనవ్యయము కనపడుచున్నది. నూతన నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపాటు పనికిరాదు. ముహూర్త నిర్ణయము మరియు గోచారము కొంతవరకు అనుకూలముగా  ఉన్ననూ మితిమీరిన ఆత్మస్థైర్యము ఎదుటివారిని తక్కువగా అంచనా వేయడము, దురహంకారము మొదలైన విషయాలు దరికి రానీయకండి. ఆరోగ్యము అశ్రద్ధ చేయరాదు. ఆరోగ్య సమస్యలు ఎదురయినా ఉపశమనము నివారణ మార్గాలు లభిస్తాయి. తద్వారా కొంత మానసిక, శారీరక బాధ ఏర్పడినా వాటిని అధిగమిస్తారు. వ్యాధులకు సరియైన సమయంలో రోగ నిర్ధారణ జరిగి ఉపశమనము పొందుతారు. స్త్రీలు గర్భసంబంధమైన సమస్యలపై వైద్యుని సలహా పాటించాలి. ఒంటరితనమును అనుభవించడము, విపరీతమైన ఆలోచనలు రావడం జరుగవచ్చును. జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు, దుర్జన సహవాసాలకు దూరంగా ఉండండి. మీ యొక్క పరపతికి ప్రతిష్టకు భంగము కలుగకుండా జాగ్రత్త పడవలయును. కనపడని శతృబాధ సూచన కలదు. వ్యాపారంలో ఒకింత జాగ్రత్తలు అవసరం. నూతనంగా పెట్టుబడులు పెట్టునపుడు జాగ్రత్త అవసరము. ఉద్యోగస్తులు అత్యుత్సాహంతో తమలోని రహస్యాలను తమ వృత్తిపరమైన నైపుణ్యానికి సంబంధించిన రహస్యాలను బయటపెట్టడము వలన ఒకింత ఇబ్బందికర వాతావరణము ఏర్పడవచ్చును. శ్రమమీది ఫలితము మరొకరిది కావచ్చును. విష జంతువుల వల్ల ఒకింత భయము ఏర్పడవచ్చును. అర్థంకాని అనారోగ్యము, దీర్ఘకాలిక వ్యాధులు చికాకు కలిగించే అవకాశం గలదు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచన గలదు. దాంపత్యములో అపోహలు, అనవసరమైన వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తపడవలయును. ఈ క్షణము ప్రశాంతత, మరుక్షణంలో ప్రళయము వంటి పరిస్థితులు ఎదురుకావచ్చును. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. అకారణంగా అకస్మాత్తుగా కలహాలు సంభవించే అవకాశము గలదు. స్త్రీ, పురుష స్నేహాల విషయంలో ఇబ్బందికరమైన సంఘటనలు సంభవించే అవకాశము గలదు. స్థిరాస్తులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మితిమీరిన ఆత్మ విశ్వాసము పనికిరాదు. మూత్ర సంబంధమైన లేదా కటినుండి జానువుల మధ్యన అనారోగ్య సూచనలు. కొందరికి వివాహ సంబంధాలు తప్ప పోవటమో లేదా వివాహవయస్సుకు పూర్వమే వివాహ ప్రయత్నాలు జరుగుట సంభవించవచ్చును. కొన్ని సందర్భములలో తనవారినే అనగా జీవిత భాగస్వామితోగాని, తమ సంతానముతోగాని తరచుగా అసత్యము పలుకుట, ముఖ కవళికలో మార్పు, మధ్యస్థమైన వివాదాలకు,మద్యవర్తిత్వాలకు జమావతులకు కాస్త దూరంగా ఉండండి. తనకోపమే తనశతృవని తెలుసుకొండి. మీ మనస్సు ఎంత నిర్మలమైనా ఎంత ప్రేమమయమైనా ఉన్నా దానిని మీరు సరియైన విధంగా బహిర్గతము చేయకపోవడం వల్ల మీరు అహంకారిగా ముద్రపడతారు. భాగస్వామ్య వ్యాపారాలు జాగ్రత్తగా చేయాలి. ఎవరితోనూ అతి శతృత్వము  పనికిరాదు. దైనందిన కార్యక్రమాలు తరచుగా వాయిదా పడడము జరుగవచ్చును. దురలవాట్లకు దూరంగా ఉండండి. మధుపాన, ధూమపానములకు దూరంగా ఉండండి. మాట తడబడుట, ముఖ సంబంధిత చికాకులు ఏర్పడవచ్చును. ఉద్యోగస్తులు తమ బాధ్యతపై శ్రద్ధ చూపించండి. ఒక రకమైన సోమరితనము వెంటాడవచ్చును. వాహనములు తగు జాగ్రత్తగా నడుపవలెను. ఏదో తెలియని భయము, విద్యార్థులు అధిక శ్రద్ధ కనపరిచిన చక్కని ఫలితములరిు పొందగలరు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ఆలోచనలు కొంత నష్టపరచవచ్చును. శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. మేధోశక్తిని పొందండి. రాజకీయములలో ఉన్నవారు, ఉద్యోగంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారు అత్యాశతో అనర్థాలకు స్వాగతం పలుకరాదు. ప్రతి పనిని అవసరానికన్నా ఎక్కువ శ్రమించవలసిన పరిస్థితి ఉద్యోగము మారాలనే ఆలోచన రావచ్చును. తొందరపాటు పనికిరాదు. బంధువులతో స్నేహితులతో విరోధాలు తాంత్రిక బాధితులు అవడము, మతపరమైన వివాదాలతో కొంత ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొనుట, నిర్ణయాలు సరియైన సమయానికి తీసుకోకపోవడం, అసత్య ప్రియత్వము పెరుగుట, కుటుంబంలో భార్య, పిల్లలు, బంధువుల మధ్య అభిప్రాయ బేధాలు రావచ్చును. చోరభయము, విలువైన అభరణములు, మరియు విలువైన ఆస్తికి సంబంధించిన పత్రములు జాగ్రత్త పరచుకోనవలయును. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. ఇతరులు చేసిన పొరపాట్లకు తాము బాధ్యత వహించవలసిన పరిస్థితులు రావచ్చును. అజీర్ణము. ఉదర సంబంధమైన అవస్థలు ఉండవచ్చును. ఋణబాధలు, కార్యాలు, ప్రయత్నాలు ఏదో విధముగా వాయిదా పడటము. తమ సహనానికి ఒక పరీక్షగా మారవచ్చును.

    అయితే ఈ విధమైన సమస్యలు బాధించినా గురుబలము జులై 14 నుండి చాలా అనుకూలముగా ఉండును. మరియు మూర్తినిర్ణయము ద్వారా ఈ సంవత్సరము బృహస్పతి చాలా వరకు అనుకూలముగా ఉన్నందువలన అనేక సమస్యల నుండి ఉపశమనము పొందుతారు. సమస్యలు ఎదురు అయినా వాటిని అధిగమించి సరియైన సమయంలో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవివాహితులకు వివాహప్రాప్తి, అనుకూల దాంపత్యము లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందవచ్చును. మేధాశక్తి పెరుగుతుంది. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్థులు వృద్ధిపరుచుకునే ప్రయత్నము సఫలము కావచ్చును. ఆరోగ్యము అనుకూలించవచ్చును. దీర్ఘకాలిక వ్యాధులకు దాగి ఉన్న కోరికలు సిద్ధించవచ్చును. ప్రయాణాలు సఫలమవుతాయి. ఆదాయ వనరులు పెరిగే అవకాశము గలదు. బంధుమితృల సహాయము లభించవచ్చును. విద్యార్థులకు చక్కని ఫలితాలు లభించవచ్చును. సంవత్సరం ఉత్తరార్థంలో జరుగు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధించవచ్చును. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తుల సహాయసహకారాలు లభిస్తాయి. స్త్రీ  సౌఖ్యము లభిస్తుంది. నూతన వాహన కొనుగోలు విలాసవంతమైన జీవితము తమ వాక్కు ద్వారా ఎదుటివారిని ఆకర్షించుట. తెలివితో అసాధ్యాలను, సుసాధ్య దిశగా నడిపించుట విద్యాభివృద్ధి భూపరమైన వివాదాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలించవచ్చును. నూతన వ్యాపారాలలో ప్రవేశము పరోక్ష శతృవులు మాత్రము కొంత విసిగించే అవకాశము గలదు. ఉద్యోగస్తులు మాత్రము మీ తెలివి, కష్టించి పనిచేసే గుణాన్ని మరువకండి. భవిష్యత్తులో అదే మీకు శ్రీరామరక్ష. ఉద్యోగస్తులు యాజమాన్యం యొక్క ప్రశంసలు పొందుతారు. చాలా రోజులుగా రావలసిన బకాయిలు రావచ్చును. కళాకారులకు అనుకూలము, విదేశీ ప్రయత్నాలు సఫలము కావచ్చును. ఋణ బాధల నుండి బయటపడతారు. శుభకార్యాచరణ, కన్యాదానఫలము తమ విద్యుక్త ధర్మంలో నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. అనేకమైన సమ్యలు మీపై దాడి చేసినా తెలివిగా వాటినుండి సురక్షితంగా బయటపడతారు. రాజకీయ పరంగా, ప్రభుత్వపరంగా గుర్తింపు లభించవచ్చును. మొత్తం మీద ఈ రాశివారి పూర్వార్థం కన్నా ఉత్తరార్థం బాగుంటుంది. నిత్యం శని, రాహు,కేతు, గురు జప ధ్యాన శ్లోకాలు పఠించండి. హనుమాన్‌ చాలీసా, సుందరకాండ పారాయణం రక్షిస్తుంది. అనాథ విద్యార్థులకు చేయూతనివ్వండి.