వంకాయ పచ్చడి

 

 

 

 

కావలసినవి:
వంకాయలు : రెండు కేజీలు.
ఉప్పు : సరిపడగా
కారం : తగినంత.
చింతపండు : అరకేజీ.
నూనె :  తగినంత
ఆవాలు:  ఒక స్పూన్
ఇంగువా : కొద్దిగా

 

తయారీ :

 

ముందుగా వంకాయలు శుభ్రంగా కడిగి, తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు, ఉప్పు, కొన్ని వంకాయ ముక్కలు, కారం వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మిగిలిన వంకాయ ముక్కలు వేసి కొంచెం పలుకుగా  గ్రైండ్ చెయ్యాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి వేడయ్యాక నూనె పోసి ఆవాల గింజలు, ఇంగువ వేసి గ్రైండ్ చేసుకున్న వంకాయ మిశ్రమాన్నివేసి  కాసేపు నూనెలో వేయించి చల్లారక సీసాల్లో భద్రపరుచుకోవచ్చు.