రవ్వ పులిహోర

 

 

కావలసినవి:

బియ్యపు రవ్వ - నాలుగు కప్పులు 

శనగపప్పు - చిన్న కప్పు

మినపపప్పు - చిన్న కప్పు

ఆవాలు - కొద్దిగా 

ఇంగువ - చిటికెడు 

వేరుశనగలు - ఒక కప్పు 

ఎండు మిర్చి - ఎనిమిది

పచ్చిమిర్చి - పది 

కరివేపాకు - ఐదు రెబ్బలు 

చింతపండు - తగినంత 

పసుపు - ఒక స్పూను 

ఉప్పు, నూనె - తగినంత 


తయారుచేసే పద్ధతి:

ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు ఎసరు పెట్టి, దానిలో బియ్యపు రవ్వ కలిపి పొడిపొడిగా ఉడికాక స్టౌ మీద నుంచి  కిందికి దించుకోవాలి.

 

తరువాత రెండు స్పూన్లు నూనె పైన పోసి, మూతపెట్టి ఉమ్మగిల్లే వరకు ఉంచాలి.

 

అలాగే దీన్ని ఒక వెడల్పు పళ్లెంలో తీసి చల్లార్చాలి.

 

ఈ మిశ్రమం పొడిగా ఉండేలా చేతితో చిదపాలి.

 

ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి కాగిన తరువాత ఆవాలు, వేరుశనగలు, శనగపప్పు, మినపపప్పు, కరివేపాకు, పసుపు, ఇంగువ, తగినంత ఉప్పు వేసుకోవాలి.

 

తర్వాత అందులో చింతపండు గుజ్జు పిండి ఉడికించాలి.

 

ఈ మిశ్రమాన్ని పళ్లెంలో చల్లార్చిన రవ్వ పిండిలో కలుపుకోవాలి.

 

అంతే ఎంతగానో ఊరించే రవ్వ పులిహోర రెడీ. ఇందులో నిమ్మకాయ పిండుకుని తింటే అదుర్స్....