రాజ్‌మా పాలక్

 

 


కావలసిన పదార్థాలు:

రాజ్ మా                                       - అరకప్పు
పాలకూర                                      - రెండు కప్పులు
ఉల్లిపాయ                                     - ఒకటి
టొమాటో                                      - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్                          - ఒక చెంచా
గరం మసాలా                               - ఒక చెంచా
జీలకర్ర                                         - అరచెంచా
కారం                                           - ఒక చెంచా
పసుపు                                       - చిటికెడు
ఉప్పు                                          - తగినంత
నూనె                                           - రెండు చెంచాలు

తయారీ విధానం:

రాజ్ మాను శుభ్రంగా కడిగి, రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లు ఒంపేసి, మూడు విజిల్స్ వచ్చే వరకూ కుక్కర్ లో ఉడికించాలి. పాలకూరను నీటిలో వేసి ఆకు మెత్తబడే వరకూ ఉడికించాలి. తరువాత టొమాటోతో కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక జీలకర్ర వేయాలి. చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయే వరకూ వేయించి, పాలకూర ప్యూరీని వేయాలి. ఆపైన పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. ఓ నిమిషంపాటు ఉడికించాక తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేయాలి. ఐదు నిమిషాల పాటు ఉడికించాక రాజ్ మా వేసి మళ్లీ మూత పెట్టేయాలి. కూర బాగా ఉడికి, దగ్గరగా అయ్యేంత వరకూ ఉంచి దించేసుకోవాలి. ఇది అన్నంలోకీ రోటీల్లోకీ కూడా బాగుంటుంది. రోటీ తిన్నప్పుడు కొద్దిగా వెన్నపూస వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.

- sameera