వరిగ ఇడ్లీ

 

 

 

కావలసిన పదార్ధాలు:

వరిగ ఇడ్లీ రవ్వ - 1 కప్పు

మినప్పప్పు - ఒక కప్పు

ఉప్పు - తగినంత

 

తయారుచేసే విధానం: 

మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి 6 గంటలపాటు మినప్పప్పును నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వరిగ ఇడ్లీ రవ్వలో, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి, రాత్రంతా పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఇడ్లీ ప్లేట్స్ కు కొద్దిగా నూనె రాసి వరిగ ఇడ్లీ పిండిని ఇడ్లీ రేకులలో వేసి..  ఇడ్లీ పాత్రలో కొన్ని  నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి ఇడ్లీలను పది నిముషాలు ఉడికించాలి. తరువాత  ఇడ్లీ స్టాండును బయటకు తీసి.. ఆ తర్వాత ఇడ్లీలను సపరేట్ చేసి వేడి వేడి సాంబార్, కొబ్బరి చట్నీతో సర్వ్ చేయాలి.