వరిగ బర్ఫీ

 

 

 

కావలసిన పదార్ధాలు:

వరిగ పిండి - 1 ఒక కప్పు

నెయ్యి - 1 టేబుల్‌ స్పూను

బాదం పప్పులు - 10

యలకుల పొడి - అర కప్పు

బెల్లం పొడి - అర కప్పు

నీళ్లు - పావు కప్పు

 

తయారుచేసే విధానం:

ఒక ప్లేటుకి నెయ్యి పూసి పక్కన ఉంచాలి. మందపాటి గిన్నెలో బెల్లం పొడి, పావు కప్పు నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి. వరిగ పిండి వేసి పచ్చి వాసన పోయి, సువాసన వచ్చేవరకు వేయించాలి. కరిగించిన బెల్లం పాకం, ఏలకుల పొడి జత చేసి ఆపకుండా కలుపుతుండాలి. బాగా గట్టిపడుతుండగా, నెయ్యి జత చేస్తూ ఆపకుండా కలిపి, బాగా ఉడకగానే దింపేయాలి. నెయ్యి పూసుకున్న ప్లేట్‌లో వేసి సమానంగా పరిచి, పైన బాదం పప్పులు వేయాలి. కొద్దిగా చల్లారుతుండగా, చాకుతో ముక్కలుగా కట్‌ చేయాలి. చల్లారాక ప్లేట్‌లో ఉంచి అందించాలి.