పన్నీర్ చీజ్ శాండ్విచ్..!!

కావాల్సిన పదార్థాలు:

బ్రెడ్-మీకు కావాల్సినన్ని

ఉల్లిపాయ -1 మీడియం సైజు సన్నగా తరగాలి.

కారం- 1 టేబుల్ స్పూన్

గరం మసాలా- 1 టేబుల్ స్పూన్

టమాటా కెచప్ -3 స్పూన్స్

పన్నీర్ ముక్కలు- 1 కప్పు

చీజ్- మీకు నచ్చినంత

తయారీ విధానం:

స్టౌ వెలిగించి..బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయలు వేసి నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఉప్పు, మసాలపొడి వేసి కలపాలి. అందులో చీజ్ వేయాలి. తర్వాత పన్నీర్ వేయాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని పైన పన్నీర్ మిక్స్ తోపాటు చీజ్ వేసి మరొక బ్రెడ్ స్లైస్ తో కవర్ చేయండి. దాన్ని బ్రౌన్ కలర్ వచ్చేవరకు రెండు వైపులా కాల్చండి. తర్వాత ట్రయాంగిల్ షేపులో మధ్యలో కట్ చేసి సర్వ్ చేయండి. ఇది పిల్లలకు మాత్రమే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది