మునగాకు పొడి

 

 

కావలసిన పదార్ధాలు :

మునగాకు - 1 కప్పు

ధనియాలు - 2 చెంచాలు

ఎండుమిరపకాయలు - 4 నుండి 6 లేదా కారానికి తగినంత

జీలకర్ర - 1 చెంచా

మినప్పప్పు - 1 చెంచా

శనగపప్పు - 1 చెంచా

కరివేపాకు - 10 లేదు 15

నువ్వులు - 2 చెంచాలు

ఉప్పు - 1 చెంచాలు

పసుపు - చిటికెడు

చింతపండు - కొద్దిగా

వెల్లుల్లి రెబ్బలు - 6 నుంచి 8

 

తయారు చేయు విధానం:

పొడి మూకుడులో మొదట మునగాకులు 5 నుండి 10 ని'' వేయించాలి... తక్కువ మంటపై వేయించాలి.

 

ప్రక్కన మరో పాన్ లో మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు అన్ని ఒకదాని తరువాత ఒకటి వేస్తూ చిన్నమంటపై దోరగా వేయించుకోవాలి.

 

చివరిలో చింతపండు వేసి ఉప్పు కలిపి.. గోరువెచ్చగా ఉండగా ముందు పోపు.. దంచి తరువాత ఆకులు కలిపి పొడి చేసుకోవాలి.

 

మరి మెత్తగా కాకుండా చేసుకుంటే పంటికింద పడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బావుంటుంది.

- భారతి