మ్యాంగో శ్రీఖండ్

 

 

కావలసిన పదార్థాలు:

మామిడిపండ్లు                            - రెండు
పెరుగు                                       - మూడు కప్పులు
చక్కెర                                        - అరకప్పు
పాలు                                         - నాలుగు చెంచాలు
యాలకుల పొడి                          - ఒక చెంచా
కుంకుమపువ్వు                        - చిటికెడు

తయారీ విధానం:

పెరుగును పలుచని గుడ్డలో కట్టి రెండు మూడు గంటల పాటు ఉంచాలి. దానివల్ల నీళ్లు పూర్తిగా పోతాయి. చెంచాడు పాలలో కుంకుమపువ్వును వేసి ఉంచాలి. మామిడిపండ్లను మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. నీళ్లు పోగా మిగిలిన పెరుగును మామిడిపండు గుజ్జు, చక్కెర, మిగిలిన పాలతో కలిపి మిక్సీ పట్టాలి. బాగా సాఫ్ట్ గా అయ్యాక తీసేసి కుంకుమపువ్వును కలపాలి. కాసేపు ఫ్రిజ్ లో ఉంచి, యాలకుల పొడి చల్లి సర్వ్ చేయాలి.

- Sameera