కొత్తిమీర రైస్

 

 

 

 

కావలసినవి:
కొత్తిమీర - నాలుగు కట్టలు
టమాటాలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
సాజీరా - ఒక చెమ్చా
వండిన అన్నం - పెద్ద కప్పుతో
నూనె, ఉప్పు, పసుపు, నెయ్యి - తగినంత
వేయించిన జీడిపప్పు - 10

 

తయారీ విధానం:
ముందుగా అన్నాన్ని పొడిపొడిగా వండి పెట్టుకోవాలి. తర్వాత మూకుడులో రెండు చెమ్చాల నూనె వేసి చిన్న ముక్కలుగా కోసిన టమాటా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి వేసి మగ్గించాలి. మూత పెట్టకుండా ఉంచితే నీరు పట్టదు పొడిపొడిగా వస్తుంది. మగ్గిన కొత్తిమీర, టమాటా మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మూకుడులో నాలుగు చెమ్చాల నూనె, ఒక చెమ్చా నెయ్యి వేసి కాగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సాజీరా, వెల్లుల్లి వేసి, సాజీరా ఎర్రగా కాకుండానే వెంటనే మెత్తగా రుబ్బిన కొత్తిమీర మిశ్రమాన్ని వేసి వేయించాలి. కొంచెం తడి పోగానే ఉడికించిన అన్నం, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి. దాని మీద వేయించిన జీడిపప్పు గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర రైస్ వేడివేడిగా తింటే చాలా రుచిగా వుంటుంది. బూందీ, రైతా దీని కాంబినేషన్.

 

 

-రమ