కేరళ స్టైల్ టమోటా చట్నీ- 1

 

 

 

 

కావల్సినవి :

టమోటాలు
ఇంగువ
ఉప్పు
ఎండుమిర్చి
పసుపు
కారం
జీలకర్ర
ఆవాలు
నూనె
వెల్లుల్లి

 

తయారీ :
నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ వేసి, పోపు వేగాకా టమాటా, ఉప్పు, పసుపు,కారం వేసి ఐదు  నిముషాలు వేయించి కొంచం నీళ్ళు జల్లి మూత పెట్టాలి. టమాటా మెత్తగా మగ్గే దాకా ఉంచి ఆ తరువాత దించాలి. టేస్టీ కేరళ టమాటా చట్నీ రెడీ...

 

 

కేరళ స్టైల్ టమాటా చట్నీ-2

 

 

 

 

కావలసినవి :
ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమాటా - మూడు (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి -  మూడు (సన్నగా కట్ చేసుకోవాలి )
ఎండుమిర్చి - రెండు
కరివేపాకు
నూనె
మినపప్పు, ఆవాలు,ఉప్పు - తగినంత

 

తయారీ
నూనె లో మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు వేసి వేయించాలి.పోపు వేగాక వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి రెండు నిముషాలు వేయించి ఆ తరువాత టమాటా మెత్తగా మగ్గేదాకా ఉంచి ఆ తరువాత దించాలి.చల్లారక మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. తరువాత పోపు దినుసులతో పోపు చెయ్యాలి...

 

 

- రమాదేవి