జొన్నల కార బూందీ

 

 

కావలసిన పదార్ధాలు: 

జొన్న పిండి - 1 కప్పు

జీడిపప్పులు - 10 గ్రా

గోధుమ పిండి / సెనగ పిండి - 1 కప్పుకి కొద్దిగా తక్కువ

మిరప కారం - 1 టీ స్పూను

నూనె - తగినంత

నీళ్లు - తగినన్ని

కరివేపాకు - 2 రెమ్మలు

ఉప్పు - తగినంత

 

తయారుచేసే విధానం:

ఒక గిన్నెలో జొన్న పిండి, గోధుమ పిండి లేదా సెనగ పిండి వేసి బాగా కలిపి, తగినంత ఉప్పు, కారం, నీళ్లు జత చేసి జారు పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద వెడల్పాటి బాండీ లో నెయ్యి వేసి వేడిచేయాలి. తయారుచేసి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూయాలి. దోరగా వేగిన బూందీని ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, నూనెలో వేయించిన జీడిపప్పు, కరివేపాకు జత చేసి బాగా కలపాలి. కొద్దిగా చల్లారాక సర్వింగ్ చీసుకోని తినాలి. ఇదేవిధంగా సజ్జలు, రాగులతో కూడా చేసుకోవచ్చు..