రాగి మురుకులు

 

 

 

కావలసిన పదార్ధాలు:

రాగి పిండి - రెండు కప్పులు

బియ్యప్పిండి - ఒక కప్పు

ఉప్పు - తగినంత

వేడి నీళ్లు - పిండి కలపడానికి తగినన్ని

వాము - ఒక టీ స్పూను

నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా

 

తయారుచేసే విధానం: 

ఒక పెద్ద పాత్రలో రాగి పిండి, వాము, బియ్యప్పిండి, ఉప్పు వీటి అన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. వేడి నీళ్లు జత చేసి జంతికల పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి.  మురుకులు చేసే గొట్టంలో పిండిని వేసి మురుకులు వత్తి కాగిన నూనె లో వేయించాలి. బాగా వేగిన తరవాత తీసి సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి.